‘కేజీఎఫ్’ ‘కన్నడ పవర్’ కు అంకితమిస్తున్నా:  ప్ర‌శాంత్ నీల్

Puneet: కన్నడ స్టార్ హీరో యష్, శ్రీనిధి శెట్టి జంటగా న‌టించిన తాజా చిత్రం కేజీఎఫ్ 2. సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజీఎఫ్ 1 క‌న్న‌డ‌లోనే కాకుండా మిగిలిన భాష‌ల్లో కూడా స‌క్స‌స్ సాధించ‌డంతో కేజీఎఫ్ 2 పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఈ భారీ పాన్ ఇండియా మూవీని ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 14 న రిలీజ్ చేయ‌నున్నారు. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్లో స్పీడు పెంచారు మేక‌ర్స్. ఇందులో భాగంగానే నేడు ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ బెంగుళూరులో ఘనంగా నిర్వహించారు. ఇక ఈ ఈవెంట్ ని బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ చేయడం విశేషం.

ఈ సందర్భంగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ “మా మాట మన్నించి ట్రైలర్ ని లాంచ్ చేసిన స్టార్ హీరోలందరికి ధన్యవాదాలు. ఈ సినిమా కోసం పని చేసిన ప్రతిఒక్కరికి థాంక్స్ చెబుతున్నాను. అందరూ చాలా కష్టపడి పని చేశారు. కేజీఎఫ్ ఫ్రాంచైజీ కోసం ఎనిమిదేళ్లు నాతో కలిసి ప్రయాణించిన వారందరికి కృతఙ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ ఎనిమిదేళ్ల కష్టాన్ని దివంగత కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కు అంకింతమిస్తున్నాను. ఆయన లేని లోటును ఎవరు తీర్చలేరు” అంటూ ఎమోషనల్ అయ్యారు. ప్ర‌శాంత్ నీల్ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. పునీత్ కి ఇది నిజమైన నివాళి అంటూ కన్నడిగులు ప్రశాంత్ నీల్ ని ప్రశంసిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *