మరో చిత్రంలో ఖుష్బూ

 Khushbu-Telugu: యాక్ష‌న్ హీరో గోపీచంద్, ద‌ర్శ‌కుడు శ్రీవాస్ తో క‌లిసి ఓ భారీ చిత్రం చేస్తున్నారు. గోపీచంద్ 30వ చిత్రంగా రూపొందుతోన్న ఈ భారీ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ నిర్మిస్తుంది. ఇందులో గోపీచంద్ స‌ర‌స‌న డింపుల్ హ‌య‌తి క‌థానాయిక‌గా న‌టిస్తుంది. డిసెంబ‌ర్ లో ప్రారంభ‌మైన ఈ సినిమా క‌రోనా కార‌ణంగా సెట్స్ పైకి వెళ్ల‌డం ఆల‌స్యం అయ్యింది. ఇప్పుడు ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది.

తాజా వార్త ఏంటంటే.. ఈ సినిమా షూటింగ్ ఈ రోజు హైదరాబాద్‌లో ప్రారంభం అయ్యింది. ఈ షెడ్యూల్‌లో కీలక తారాగణం పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు మేకర్స్. ఇందులో సీనియర్ హీరోయిన్ ఖుష్బూ కూడా కీలకపాత్రను పోషించనుంది. ఇదే విషయాన్నీ ప్రకటిస్తూ మేకర్స్ ఒక కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడిన పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో జగపతి బాబు కీలక పాత్ర పోషిస్తున్నాడు. టిజి విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Also Read : ఆడవాళ్ళంతా చూడాల్సిన చిత్రం ఇది :  ఖుష్భూ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *