Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్ఫైనల్ లో శ్రీకాంత్ ఓటమి

ఫైనల్ లో శ్రీకాంత్ ఓటమి

Kidambi Lost: తెలుగు తేజం కిడాంబి శ్రీకాంత్ పోరాడి ఓడిపోయాడు.  బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో స్పెయిన్ లోని హుయెల్వాలో జరిగిన వరల్డ్ ఛాంపియన్ షిప్-2021 టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో నేడు జరిగిన ఫైనల్ మ్యాచ్ లో సింగపూర్ ఆటగాడు లొహ్ కీన్ యెవ్ చేతిలో 21-15; 22-20 తేడాతో ఓటమి పాలయ్యాడు.

మొదటి సెట్ ను కోల్పోయిన శ్రీకాంత్ రెండో సెట్ లో హోరా హరీ తలపడ్డాడు, కానీ చివర్లో కీన్ పైచేయి సాధించి రెండో సెట్ కూడా చేజిక్కించుకొని టైటిల్ సాధించాడు. గత ఆదివారం మొదలైన ఈ మెగా టోర్నీ నేడు ముగిసింది.

  • మహిళల సింగిల్స్ లో యమగుచి (జపాన్) 21-14; 21-11 తేడాతో తై జు యింగ్ (చైనీస్ తైపీ) పై
  • మహిళల డబుల్స్ లో చెన్ కింగ్, జియా ఈ ఫ్యాన్(చైనా) జోడీ 21-16; 21-17 తేడాతో లీ షూ, షిన్ (కొరియా)పై
  • పురుషుల డబుల్స్ లో టకురో హోకి, యుగో కొబయషి (జపాన్) ద్వయం 21-12; 21-18 తేడాతో చైనా ఆటగాళ్ళు హి జి టింగ్, టాన్ కియాంగ్ పై
  • మిక్స్డ్ డబుల్స్ లో జోడీ డేచాపోల్, సప్సిరీ (థాయ్ లాండ్) 21-13; 21-14 తేడాతో యుటా వాటంబే, అరిసా హిగాశినో (జపాన్) జంటపై విజయం సాధించారు.
RELATED ARTICLES

Most Popular

న్యూస్