Monday, June 8, 2026
Homeస్పోర్ట్స్లక్ష్య సేన్ – శ్రీకాంత్ మధ్య సెమీస్ పోరు

లక్ష్య సేన్ – శ్రీకాంత్ మధ్య సెమీస్ పోరు

Srikanth Vs. Lakshya Sen:
బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్ షిప్-2021 టోర్నీలో రేపు ఆసక్తికర పోటీ జరగనుంది. భారత ఆటగాళ్ళు కిడాంబి శ్రీకాంత్- లక్ష్య సేన్  లు ఫైనల్ బెర్త్ కోసం సెమీస్ లో తలపడనున్నారు. పురుషుల, మహిళల డబుల్స్ జట్లు ప్రీ క్వార్టర్స్ దశలోనే నిష్క్రమించగా, నేడు జరిగిన క్వార్టర్ పోరులో మహిళల సింగిల్స్ విభాగంలో సింధు ఓటమి పాలై నిరాశ పరిచింది.

పురుషుల సింగిల్స్ లో నేడు భారత ఆటగాళ్ళు ముగ్గురు కిడాంబి శ్రీకాంత్, లక్ష్య సేన్, ప్రన్నోయ్ లు క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ లు ఆడగా శ్రీకాంత్, లక్ష్య సేన్ లు తమ ప్రత్యర్ధులపై విజయం సాధించి సెమీస్ లో అడుగు పెట్టారు. అయితే సెమీస్ లో వీరిద్దరే తలపడుతుండడం విశేషం.

కిడాంబి శ్రీకాంత్ 21-8; 21-7  తేడాతో నెదర్ల్యాండ్స్ ఆటగాడు మార్క్ కాల్జోవ్ పై ఘన విజయం సాధించాడు.

మరో మ్యాచ్ లో లక్ష్య సేన్ 21-15; 15-21; 22-20 తేడాతో చైనా ఆటగాడు ఝావో జూన్ పెంగ్ ను ఓడించి సెమీస్ కు చేరాడు.

కానీ ప్రన్నోయ్ 21-14; 21-12 తేడాతో సింగపూర్ ఆటగాడు లొహ్ కీన్ యెవ్ చేతిలో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular