Saturday, June 27, 2026
Homeసినిమా‘మీటర్’ టీజర్ ని లాంచ్ చేసిన డైరెక్టర్ బాబీ కొల్లి

‘మీటర్’ టీజర్ ని లాంచ్ చేసిన డైరెక్టర్ బాబీ కొల్లి

మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో, కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మీటర్’. రమేష్ కడూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్ 7న విడుదల కానున్న ఈ సినిమా టీజర్ ని బాబీ కొల్లి లాంచ్ చేశారు. యాక్షన్, ఎంటర్ టైమెంట్, కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ సమపాళ్లలో పక్కా మాస్ ‘మీటర్’ తో టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది. కిరణ్ అబ్బవరం డాషింగ్ అండ్ మాస్ పోలీస్ ఆఫీసర్ గాఎంట్రీ ఇచ్చారు.

యాక్షన్ సన్నివేశాలు నెక్స్ట్ లెవల్ లో వున్నాయి. కిరణ్ చేసిన డ్యాన్స్ మూమెంట్స్ ని మాస్ ని మురిపిస్తున్నాయి. ‘’నా మీటర్లో నేను వెళ్తా నన్ను గెలకొద్దు… నాకు అడ్డు రావద్దు’’ అని కిరణ్ అబ్బవరం చెప్పిన డైలాగ్ పవర్ ఫుల్ గా వుంది. కొత్త దర్శకుడు రమేష్ కడూరి అవుట్ అండ్ అవుట్ మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్ ని అందిస్తున్నాడని టీజర్ చూస్తే అర్ధమౌతోంది. సాయి కార్తీక్ నేపధ్య సంగీతం టీజర్ ని మరింత ఎలివేట్ చేసింది. వెంకట్ సి దిలీప్, సురేష్ సారంగం కెమరా పనితనం బ్రిలియంట్ గా వుంది. మైత్రీ మూవీ మేకర్స్‌, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణ విలువలు ఉన్నతంగా వున్నాయి.

టీజర్ లాంచ్ ఈవెంట్ లో బాబీ కొల్లి మాట్లాడుతూ… నిర్మాత చెర్రీ గారు చాలా క్లాస్ గా కనిపిస్తారు కానీ లోపల మాస్ మీటర్ వుంది. మా అసోషియేట్ రమేష్ పై నమ్మకం వుంచి ఈ సినిమా ఇచ్చిన చెర్రీ, మైత్రీ మూవీ మేకర్స్ కిరణ్ అబ్బవరంకు ధన్యవాదాలు. ఈ సినిమాతో కిరణ్ అబ్బవరం కు మాస్ మీటర్ ని సెట్ చేస్తోందని నమ్ముతున్నాను. టీజర్ చూస్తుంటే పక్కా మాస్ కమర్షియల్ మీటర్ అనిపిస్తోంది. ఈ సినిమా యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్’’ చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular