Saturday, April 20, 2024
Homeసినిమా10న వస్తున్న 'రానా నాయుడు'

10న వస్తున్న ‘రానా నాయుడు’

వెంకటేశ్‌ దగ్గుబాటి, రానా దగ్గుబాటి తండ్రీకొడుకులుగా తొలిసారి కలిసి నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘రానా నాయుడు‘. ఇందులో వెంకటేశ్‌ నాగ నాయుడు, రానా నాయుడు పాత్రలు పోషిస్తున్నారు. తండ్రి కొడుకుల వార్ బ్యాక్ డ్రాప్ లో సాగే హై ఆక్టేన్, హై ఎనర్జీ పవర్ ఫుల్ యాక్షన్ డ్రామా సాగే ఈ ప్రాజెక్ట్ ని సుందర్ ఆరోన్, లోకోమోటివ్ గ్లోబల్ నిర్మించగా కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ ఎస్. వర్మ దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన ‘రానా నాయుడు’ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలని పెంచింది. మార్చి 10న ‘రానా నాయుడు’ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్‌ కానున్న నేపద్యంలో హైదరాబాద్ లో జరిగిన ప్రెస్ మీట్ లో వెంకటేష్ దగ్గుబాటి, రానా దగ్గుబాటి, సుందర్ ఆరోన్, సుపర్ణ్ వర్మ  కరుణ్ అన్షుమాన్ ‘రానా నాయుడు’ విశేషాలని పంచుకున్నారు.

రానా దగ్గుబాటి మాట్లాడుతూ… ఇప్పటి వరకు మాపై కురిపించిన ప్రేమ చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఇలాంటి ప్రాజెక్ట్ నాకు, బాబాయ్ కి కొత్త. రానా నాయుడు కోసం బాబాయ్ తో మొదటి రోజు పని చేయడం నాకు ఇప్పటికీ గుర్తుంది. మర్చిపోలేని అనుభూతి ఇది. నేను ఇప్పటి వరకూ పాజిటివ్ నెగిటివ్ రోల్స్ చేశాను. కానీ రానా నాయుడు లో రెండూ వున్నాయి. రానా నాయుడు డార్క్ నేపధ్యం  ఉన్న వ్యక్తి. తండ్రితో అతని సంబంధం మరింత డార్క్ గా వుంటుంది. ఈ ఫార్మెట్ లో చేయడం ఇదే మొదటిసారి. నెట్‌ఫ్లిక్స్‌తో స్ట్రీమింగ్ అరంగేట్రం చేయడం అమెజింగ్ రైడ్’’ అన్నారు.

వెంకటేష్ దగ్గుబాటిమాట్లాడుతూ… ‘’ట్రైలర్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటి వరకు మమ్మల్ని ఆదరించిన మా అభిమానులకు, మీడియాకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులక కృతజ్ఞతలు. రానా నాయుడు నాకు కొత్త ప్రపంచం – ఇది నా మొదటి లాంగ్. -ఫార్మాట్ ప్రాజెక్ట్. చాలా విషయాలు నేర్చుకున్నాను. ఎంతో ప్రతిభ కలిగిన రానాతో స్క్రీన్‌ను పంచుకోవడం హైలెట్. మేము ఒక సిరీస్‌లో కలిసి పని చేయడం ఇదే మొదటిసారి. చాలా ఆనందంగా ఉంది. మీ ఎంతో కష్టపడిన చేసిన ఈ షోని మీరందరూ నెట్‌ఫ్లిక్స్‌ లో చూసి ఆనందిస్తారని ఆశిస్తున్నాను.” అన్నారు.

Also Read :  తండ్రీకొడుకుల మధ్య జరిగే ఘర్షణగా ‘రానా నాయుడు’ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్