Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్కోహ్లీకి వెన్ను నొప్పి: కెప్టెన్ గా రాహుల్

కోహ్లీకి వెన్ను నొప్పి: కెప్టెన్ గా రాహుల్

KL Rahul leading: సౌతాఫ్రికాతో జరుగుతోన్న రెండో టెస్టుకు విరాట్ కోహ్లీ దూరమయ్యాడు. వెన్నునొప్పితో బాధపడుతున్న కోహ్లీ కి ఈ టెస్టు మ్యాచ్ నుంచి విశ్రాంతి ఇవ్వాలని జట్టు యాజమాన్యం నిర్ణయించింది. కెఎల్ రాహుల్ కెప్టెన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. కోహ్లీ స్థానంలో తెలుగు క్రికెటర్ హనుమ విహారీ జట్టులో చేరాడు.

జోహెన్స్ బర్గ్ లోని వాండరర్స్ స్టేడియంలో జరుగుతోన్న ఈ టెస్ట్ మ్యాచ్ లో ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. మూడో టెస్ట్ మ్యాచ్ కు కోహ్లీ అందుబాటులోకి వస్తాడని రాహూల్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

మూడు టెస్టుల సిరీస్ లో ఇండియా 1-0 తేడాతో ఆధిక్యంలో ఉంది.  14 ఓవర్లు పూర్తయ్యే సమయానికి ఇండియా ­36 పరుగులు చేసింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్