Sunday, February 23, 2025
HomeTrending Newsభద్రాద్రి రామయ్యకు కొడాలి నాని స్వర్ణ కిరీటం

భద్రాద్రి రామయ్యకు కొడాలి నాని స్వర్ణ కిరీటం

Kodali Nani _Bhadradri Ramayya :
రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని కుటుంబంతో కలిసి భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీరాముడికి రూ. 13 లక్షలు విలువ చేసే బంగారు కిరీటాన్ని కానుకగా సమర్పించారు. ఈ కిరీటాన్ని ఆలయ అర్చకులకు అందించారు. అనంతరం మీడియాతో కొడాలి నాని మాట్లాడుతూ, ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని కోరుకున్నానని చెప్పారు. ఏపీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ కు మరింత శక్తిని ఇవ్వాలని ప్రార్థించానని తెలిపారు. ఏపీ ప్రజలు ఎలాంటి కష్టాలు లేకుండా జీవించాలనేదే జగన్ ఆకాంక్ష అని చెప్పారు.

Also Read : బోర్ల కింద ప్రత్యామ్నాయ పంటలు: సిఎం

RELATED ARTICLES

Most Popular

న్యూస్