Friday, June 12, 2026
HomeTrending Newsభావోద్వేగంతో చేసిన వాఖ్యలే..వేరే ఉద్దేశ్యం లేదు - కోమటి రెడ్డి

భావోద్వేగంతో చేసిన వాఖ్యలే..వేరే ఉద్దేశ్యం లేదు – కోమటి రెడ్డి

చెరకు సుధాకర్ పై పీడీయాక్ట్ పెడితే..నేనే కోట్లాడా..నన్ను తిట్టొద్దని మాత్రమే చెరకు సుధాకర్ కొడుకుకు చెప్పానని ఎంపి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి వివరణ ఇచ్చారు. నన్ను సస్పెండ్ చేయాలని కొందరు దరిద్రులు అనడం వల్లే..భాధతో మాట్లాడానని పేర్కొ న్నారు. నకిరేకల్ లో నా పై పోస్టర్ లు వేసారు..ఎవరు వేసారో తెలుసన్నారు. మా వాళ్ళు చంపెస్తారేమోనని భయంతో మాత్రమే చెప్పా..నాపై చేసిన వాఖ్యలను ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే కు,ఇంఛార్జి ఠాక్రే ఫిర్యాదు చేశానని చెప్పారు. వెంకట్ రెడ్డి ని తిడితే నకిరేకల్ టికెట్ వస్తుందని అనుకుంటున్నారని మండిపడ్డారు.

కాంగ్రెస్‌ లో చేరిన నుంచి చెరకు సుధాకర్ నన్ను తిడుతున్నాడని ఫైర్‌ అయ్యారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నిన్న ఆడియో టేప్ వైరల్‌ కావడంపై కోమటి రెడ్డి స్పందించారు. నేను భావోద్వేగంతో చేసిన వాఖ్యలే..వేరే ఉద్దేశ్యం లేదని… 33ఏళ్ళ తన రాజకీయ జీవితంలో ఎప్పుడు రాజకీయ ప్రత్యర్ధులపై గాని ఎవరిపై కూడా దూషించలేదని పేర్కొన్నారు. నా శత్రువులను కూడా దగ్గర తీసే తత్వం నాది..తిట్టాలనుకుంటే రెగ్యులర్ ఫోన్ ఎందుకు చేస్తానని వెల్లడించారు. చదువుకున్న వ్యక్తి గా జనరల్ స్థానం అయిన నల్లగొండ మున్సిపాలిటీ ఛైర్మన్ గా వెంకట్ నారాయణ గౌడ్ కు అవకాశం ఇచ్చాం… నల్లగొండ మున్సిపాలిటీ 3 సార్లు జనరల్ అయినప్పటికీ ఆ మూడు సార్లు పట్టుబట్టి బలహీన వర్గాల వారికి దక్కేలా చూసానని వెల్లడించారు. నేను మాట్లాడిన విషయాలు కట్ చేసారు..కొన్ని అంశాలు మాత్రమే లీక్ చేసారు..రికార్డు పెట్టారని నాకు తెలుసు అన్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular