Saturday, March 14, 2026
HomeTrending Newsగ్రూపులు కట్టను – కోమటిరెడ్డి

గ్రూపులు కట్టను – కోమటిరెడ్డి

అన్ని విధాల అర్హతలు ఉండి కుడా పదవి రాకపోతే బాధగానే ఉంటుందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బాధ ఉన్నంత మాత్రాన పార్టీ మారతారా అన్న కోమటిరెడ్డి  నేను ఎప్పటికి కాంగ్రెస్ కార్యకర్తనే అని స్పష్టం చేశారు. చాలా పార్టీల నుంచి ఆఫర్ వచ్చినా పోలేదని గుర్తు చేశారు.

తెలంగాణ కోసం మంత్రి పదవికే రాజీనామా చేసిన చరిత్ర తనదన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రజా సేవ చేసేందుకు  ఏ పదవి అవసరం లేదన్నారు. భువనగిరి ఎంపీగా రూపాయి ఖర్చు లేకుండా కాంగ్రెస్ కార్యకర్తలు తనను  గెలిపించారన్నారు. నాకు పార్టీ మార్చే అవసరం లేదని, గ్రూపులు కట్టే అవసరం అంతకన్నా లేదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular