Wednesday, June 26, 2024
HomeTrending Newsవదినమ్మ పెన్నుతోనే పవన్ తొలి అధికారిక సంతకం

వదినమ్మ పెన్నుతోనే పవన్ తొలి అధికారిక సంతకం

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ) పవన్ కళ్యాణ్ తన తొలి అధికారిక సంతకాన్ని వదినమ్మ సురేఖ ఇచ్చిన ఖరీదైన పెన్నుతోనే చేయనున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతోపాటు ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా పొందిన పవన్ కళ్యాణ్‌కి అతని వదినమ్మ, మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ ఒక గొప్ప బహుమతిని ఇచ్చారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మంత్రి హోదాలో తొలిసారి చిరు ఇంటికి వచ్చిన పవన్ కళ్యాణ్ కు సురేఖ ఆయనకు అత్యంత ఖరీదైన మోంట్‌బ్లాంక్ పెన్నును బహుమతిగా ఇచ్చారు.

సురేఖ స్వయంగా పెన్నును పవన్ కళ్యాణ్ జేబులో పెట్టగా, ఆయన ఎంతో సంతోషించారు. అప్పటికే పవన్ కళ్యాణ్ దగ్గర వున్న పెన్నును తీసి చూపించారు. ‘ఇది కూడా అట్టిపెట్టుకో’ అని సురేఖ అన్నారు. ఇప్పుడు ఒక వైపు నుంచి చిరంజీవి, మరోవైపు నుంచి పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా వచ్చారు. ఈ నలుగురూ కలసి ఒక ఫొటో దిగారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘తెలుగు ప్రజల ఆకాంక్షల్ని నిజం చేస్తావని ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ వదిన, అన్నయ్య’’ అంటూ చిరంజీవి వీడియోను ముగించారు. ఈ మోంట్‌బ్లాంక్ పెన్ను ఖరీదు దాదాపు 2 లక్షల 75 వేల రూపాయలుగా ఉంటుందని అంచనా.

RELATED ARTICLES

Most Popular

న్యూస్