Saturday, June 13, 2026
HomeTrending Newsపోలీసుల అదుపులో మిలీషియా సభ్యులు

పోలీసుల అదుపులో మిలీషియా సభ్యులు

మావోయిస్ట్ పార్టీ జేగురుగొండ ఏరియా కమిటీకి అనుబంధంగా మిలీషియా కమిటీలో పని చేస్తున్న ఇద్దరు సభ్యులను చండ్రుగొండ పోలీసులు అరెస్టు చేసినట్లుగా కొత్తగూడెం డిఎస్పీ జి.వెంకటేశ్వర బాబు వెల్లడించారు. నిన్న సాయంత్రం 5 గంటల సమయంలో చండ్రుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని పోకలగూడెం గ్రామశివార్లలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులను చూసి ఇద్దరు వ్యక్తులు పారిపోతుండగా వారిని వెంబడించి పట్టుకోవడం జరిగిందని తెలిపారు. అనంతరం వారిని విచారించగా మావోయిస్టు మిలీషియా కమిటీ సభ్యులుగా తెలిసిందని వెల్లడించారు.

పట్టుబడిన ఇద్దరు మావోయిస్ట్ మిలీషియా సభ్యుల పేర్లు హేమ్లా ఐతు,  వయసు 24 ఏళ్ళు, తెర్రం గ్రామం, బీజాపూర్ జిల్లా, చత్తీస్ ఘడ్. బడిసె చందు అలియాస్ వాడే చందు,వయస్సు27 ఇల్లు, ఎర్రగుంట పంచాయితీ,ఉప్పాక,ఏడూళ్ల బయ్యారం. ఆంధ్రప్రదేశ్ . వీరిరువురు మరికొంతమంది మిలిషియా సభ్యులతో కలిసి వారి కమాండర్ ఊకె కైలాష్ ఆదేశాల మేరకు మిలీషియా కమిటీలో పని చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

వీరి వద్ద నుండి 08 కేజీల బరువున్న కార్డక్స్ వైరు,35 డిటోనేటర్లను,50 కరపత్రాలను మరియు విప్లవ సాహిత్య పుస్తకాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేసారు. పట్టుబడిన వీరిరువురిపై కేసు నమోదు చేసి రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించడం జరుగుతుందని డిఎస్పీ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular