Sunday, June 14, 2026
Homeసినిమాకౌశల్ నట కౌశలంపై ప్రశంసల వర్షం

కౌశల్ నట కౌశలంపై ప్రశంసల వర్షం

Koushal rokcs: ప్రఖ్యాత రచయిత యండమూరి వీరేంద్రనాధ్ తాజాగా దర్శకత్వం వహించిన వినూత్న కథా చిత్రం ‘అతడు-ఆమె-ప్రియుడు’. సంధ్య మోషన్ పిక్చర్స్ ప్రయివేట్ లిమిటెడ్ పతాకంపై స్టార్ హీరో సునీల్, బిగ్ బాస్ ఫేమ్ కౌశల్, సీనియర్ నటుడు బెనర్జీ ముఖ్య పాత్రల్లో… శ్రీమతి కూనం కృష్ణకుమారి సమర్పణలో… రవి కనగాల, రామ్ తుమ్మలపల్లి సంయుక్తంగా భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ విభిన్న కథాచిత్రం ఈనెల 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.

బిగ్ బాస్ విన్నర్ కౌశల్  నటించిన ‘అతడు ఆమె ప్రియుడు’ చిత్రం నుండి అద్భుతమైన సింగిల్ టేక్ డైలాగు టీజర్ ను 02.02.22. మధ్యాహ్నం 02గం.02.నిమిషాలకు చిత్ర దర్శకులు  యండమూరి వీరేంద్రనాధ్ విడుదల చేశారు. స్త్రీ ఔన్నత్యం గురించి యండమూరి అత్యద్భుతంగా రాసిన రెండు పేజీల డైలాగ్ ను కౌశల్ అంతే అద్భుతంగా సింగిల్ టేక్ లో చెప్పి ఆశ్చర్యపరిచారు. అందుకే… ఈ డైలాగ్ ట్రైలర్ ను చిత్ర రచయిత – దర్శకుడు యండమూరి ప్రత్యేకంగా విడుదల చేశారు. నటుడిగా కౌశల్ కు ఉజ్వల భవిష్యత్ ఉందని ఈసందర్భంగా యండమూరి పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular