Monday, May 20, 2024
HomeTrending Newsకేంద్ర బడ్జెట్ లో పురోగతి నిల్ - ఎంపి రంజిత్ రెడ్డి

కేంద్ర బడ్జెట్ లో పురోగతి నిల్ – ఎంపి రంజిత్ రెడ్డి

Telangana Has Ever Reached The Central Budget Trs :

కేంద్ర బడ్జెట్ ను తెలంగాణ ఎప్పుడో రీచ్ అయ్యిందని, 5 ట్రిలియన్ ఎకానమీ లో రాష్ట్రాల వాటాను తెలంగాణ ఎప్పుడో సాధించిందని తెరాస ఎంపీ రంజిత్ రెడ్డి వెల్లడించారు. ప్రస్తుత కేంద్ర బడ్జెట్ లో ఎలాంటి పురోగతి లేదని ఆయన విమర్శించారు. కేంద్ర బడ్జెట్ పై ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో  ఈ రోజు జరిగిన మీడియా సమావేశంలో చేవెళ్ల ఎంపీ డాక్టర్ జి.రంజిత్ రెడ్డి మాట్లాడుతూ… 2018లో కేంద్ర ప్రభుత్వం 5 ట్రిలియన్ ఎకానమీ అన్నారు. అప్పుడు ఎలా ఉందో, ఇప్పుడు అలాగే ఉందని ఎద్దేవా చేశారు.

5 ట్రిలియన్ ఎకానమీ కావాలంటే రాష్ట్రాలు ఎంత భాగస్వామ్యం చేయాలో తెలుసా.? 375 లక్షల కోట్ల జీడీపీ కావాలి దేశానికి అని రంజిత్ రెడ్డి అన్నారు. అంత కావాలంటే 375 లక్షల కోట్ల జిడిపికి 130కోట్ల జనాభాను భాగించి, 3.5 కోట్ల తెలంగాణ జనాభాను గుణించాలని (375÷130×3.5=10.09) వివరించారు. అంటే 10 లక్షల కోట్ల జీడీపీకి తెలంగాణ గతేడాదే చేరుకుందన్నారు.

తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉన్న జిడిపి.. ఏడో సంవత్సరంలో రెట్టింపు అయ్యిందని, అదీ టార్గెట్ ఓరియెంటెడ్ అప్రోచ్ అంటే అని సిఎం కెసిఆర్ నాయకత్వం వల్లే సాధ్యం అయిందని రంజిత్ రెడ్డి చెప్పారు. 2016లో 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు అన్నవారు, ఎందుకు సాధించలేకపోయారో చెప్పనే లేదని విమర్శించారు. జీవన్ ఔర్ తస్వీర్ తెలంగాణలో మారిపోయిందని, ఇప్పుడు మోడీ అంటున్నారని అన్నారు.

మోడీ ఇప్పుడు చెబుతున్నవి అన్నీ తెలంగాణలో ముందే సాధించామని, సాగు నీరు, తాగు నీరు ఇలా అన్నింటిలో గణనీయమైన వృద్ది  సాధించామన్నారు. వ్యవసాయంలో కూడా మూలధన వ్యయం ఉండాలి. అప్పుడే ఆధునీకరణ జరుగుతుందని ఎంపి వివరించారు. ధాన్యం సేకరణకు పాలసీ రూపొందించాలని, ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు ఇచ్చుకున్నారు. కానీ, తెలంగాణకు ఏ రంగంలో సరైన కేటాయింపులు లేవని ఆరోపించారు.

పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పేరుతో ఎన్నో కార్యక్రమంలో చేస్తున్నామని, చాలా పకడ్బందీగా మేము ప్రణాళిక ప్రకారం గ్రామాభివృద్ధి చేస్తున్నామని ఎంపి రంజిత్ రెడ్డి చెప్పారు. యూపీ కి ప్రాజెక్టు, కర్ణాటక కి ప్రాజెక్టు ఇస్తున్నారు, తెలంగాణ పట్ల వివక్ష చూపిస్తున్నారని మండిపడ్డారు. ఏ రంగంలో చూసిన తెలంగాణ నెంబర్ 1 గా ఉందని, 100% తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకిగా మారిందని తెరాస ఎంపి రంజిత్ రెడ్డి అన్నారు.

Also Read : 14 కుల సంఘాలకు ఆత్మగౌరవ భవనాలు

RELATED ARTICLES

Most Popular

న్యూస్