Sunday, January 19, 2025
HomeTrending Newsకేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Covid 19 Warriors Honors Program Under The Auspices Of Telangana Social Impact Group :

సోనూసూద్‌కు మద్దతుగా కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లోకి వస్తాడనే భయంతోనే సోనూసూద్‌పై కొందరు దుష్ప్రచారం చేశారని ఆరోపించారు. అందుకే సోనూసూద్‌పై ఈడీ, ఐటీ దాడులు చేయించారన్నారు. ఇలాంటి వాటికి సోనూ భయపడాల్సిన అవసరం లేదని, సోనూసూద్ వెంట మేం ఉంటామని మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. కొవిడ్‌ కష్టకాలంలో సోనుసూద్‌ సేవాభావాన్ని చాటుకున్నారని, తన పని.. సేవతో ప్రపంచం దృష్టి ఆకర్షించారన్నారు. విపత్తు సమయాల్లో ప్రభుత్వమే అన్నీ చేయలేదని.. స్వచ్ఛంద సంస్థల చేయూత ఎంతో అవసరమన్నారు. సామాజిక మాధ్యమాల్లో విమర్శ చేయడం సులభమని, బాధ్యతగా సేవ చేయడమే గొప్ప అన్నారు.

హెచ్ ఐసిసిలో తెలంగాణ సోషల్ ఇంపాక్ట్ గ్రూప్ ఆధ్వర్యంలో కోవిడ్-19 వారియర్స్ సన్మాన కార్యక్రమం ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి కేటీ రామారావు ,హీరో,నటుడు సోను సూద్, కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సెక్రటరీ జయేష్ రంజన్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

కేటీఆర్ లాంటి నాయకుడు ఉంటే నాలాంటి వాళ్ళ అవసరం ఎక్కువగా ఉండదని సినీ నటుడు సోనూసూద్ అన్నారు. కోవిడ్ వల్ల ఉద్యోగాలు, చదువులు, ఆత్మీయులు కోల్పోయిన వారు చాలా మంది ఉన్నారు. వాళ్లకు సహాయ పడటమే ఇక మన ముందున్న సవాలు అని ఆయన పేర్కొన్నారు. జమ్మూ నుండి కన్యాకుమారి వరకు తను సహాయ కార్యక్రమాలు చేసినా.. ఒక్క తెలంగాణ నుండే సమాంతరంగా ప్రతిస్పందించే వ్యవస్థ నాకు తారసపడింది – అది కేటీఆర్ కార్యాలయం అని సోను సూద్ ప్రశంసించారు.

Must Read :

 

మరోసారి దాతృత్వం చాటుకున్న సోనూసూద్

 

 

 

 

 

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్