Thursday, November 21, 2024
Homeస్పోర్ట్స్క్రెజికోవా జోడీకే ఫ్రెంచ్ డబుల్స్

క్రెజికోవా జోడీకే ఫ్రెంచ్ డబుల్స్

శనివారం జరిగిన ఉమెన్ సింగిల్స్ లో ఫ్రెంచ్ ఓపెన్ 2021 టైటిల్ గెల్చుకుని చరిత్ర సృష్టించిన చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి బార్బోరా క్రెజికోవా డబుల్స్ లోనూ విజేతగా నిలిచారు. తన దేశానికే చెందిన కేథరినా సినియకోవాతో కలిసి స్వైటేక్ (పోలాండ్), మత్తెక్ సాన్డ్స్(అమెరికా) జోడీపై ¬6-4, 6-2 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించారు.
ఒకే ఏడాదిలో ఫ్రెంచ్ ఓపెన్ సింగిల్స్, డబుల్స్ రెండు టైటిల్స్ గెల్చుకున్న క్రీడాకారిణి గా కూడా క్రెజికోవా చరిత్ర సృష్టించారు, 2000 సంవత్సరంలో మేరీ పియర్స్ ఈ ఘనత సాధించారు.
2016లో సెరెనా విలియమ్స్ తరువాత ఒక గ్రాండ్ స్లామ్ లో సింగిల్స్, డబుల్స్ టైటిల్స్ గెల్చుకున్న క్రీడాకారిణిగా కూడా క్రెజికోవా రికార్డు నెలకొల్పారు. చెక్ రిపబ్లిక్ కు క్రీడాకారిణి హనా మాండ్లికోవా 1981లో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెల్చుకున్నారు, మళ్ళీ ఏళ్ళకు క్రెజికోవా తన దేశానికి ఈ టైటిల్ తీసుకెళ్తున్నారు.
క్రెజికోవా, సినియకోవా జోడీ 2018లో వింబుల్డన్, ఫ్రెంచ్ ఓపెన్ గెల్చుకుంది. సిరియకోవా 2016, 2017, 2018 సంవత్సరాల్లో వింబుల్డన్ మిక్స్డ్ డబుల్స్ టైటిల్స్ కూడా గెల్చుకుంది.
తాను గతంలో చెప్పినట్లుగా ఆల్కహాల్ తీసుకోనని, కానీ ఈ విజయాన్ని ఆస్వాదించాలని అనుకుంటున్నట్లు క్రేజికోవా చెప్పింది. డబుల్స్ గెలుచుకున్న అనంతరం క్రెజికోవా-సినియకోవా జోడీ పారిస్ లో డిన్నర్ కు వెళ్ళారు. రాత్రంతా నిద్ర పట్టలేదని, పొద్దున్న లేవగానే అలసటగా అనిపించిందని, కానీ కోర్టులోకి వెళ్ళగానే ఆటమీదే ధ్యాసంతా పెట్టానని క్రెజికోవా వెల్లడించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్