Friday, April 19, 2024
Homeసినిమాకృష్ణవంశీ రంగమార్తాండ టైటిల్ లోగో విడుదల

కృష్ణవంశీ రంగమార్తాండ టైటిల్ లోగో విడుదల

హౌస్ ఫుల్ మూవీస్, రాజశ్యామల ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్ పై క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం రంగ‌మార్తాండ‌. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించారు. ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ, రాహుల్ సిప్లిగంజ్, ఆదర్స్ బాలకృష్ణ, అలీ రేజా, అనసూయ, శివాత్మిక రాజశేఖర్, తదితరులు నటించిన ఈ చిత్ర టైటిల్ లోగోను యూనిట్ సభ్యులు విడుదల చేశారు.

రంగమార్తాండ సినిమా టీజర్ , ట్రైలర్ త్వరలో విడుదల కానున్నాయి. ఆగస్ట్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మన అమ్మానాన్నల కథ గా రంగమార్తాండ థియేటర్స్ కు రానుంది, ఫ్యామిలీ ఎమోషన్స్ తో అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుంద‌ని చిత్ర‌యూనిట్ తెలియ‌చేశారు. ఈ చిత్రానికి సంగీతం: ఇళయరాజా, ఎడిటర్: పవన్, కెమెరామెన్: రాజ్ కె నల్లి, నిర్మాత: కాలిపు మధు, వెంకట్ రెడ్డి, దర్శకత్వం: కృష్ణవంశీ

RELATED ARTICLES

Most Popular

న్యూస్