Thursday, March 19, 2026
Homeసినిమాకృష్ణంరాజు తీర‌ని కోరికలు...

కృష్ణంరాజు తీర‌ని కోరికలు…

రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు ప‌రిపూర్ణ‌మైన జీవితాన్ని అనుభ‌వించారు. అయితే.. కొన్ని కోరిక‌లు తీర‌కుండానే  ఆయ‌న తిరిగిరాని లోకాల‌కు వెళ్లిపోయారు. ఇంత‌కీ ఆ  కోరిక‌లు ఏంటంటే.. ముందుగా చెప్పుకోవాల్సింది. ప్ర‌భాస్ పెళ్లిని చాలా గ్రాండ్ గా చేయాలనుకున్నారు. ‘బాహుబ‌లి’ త‌ర్వాత ప్ర‌భాస్ పెళ్లి చేసుకుంటాడ‌ని.. అమ్మాయిని చూస్తున్నామ‌ని చెప్పారు…. ఆయ‌న ప్ర‌భాస్ పెళ్లిని చూడ‌కుండానే వెళ్లిపోయారు.

ఆ త‌ర్వాత….. ప్ర‌భాస్ తో కృష్ణంరాజు ‘ఒక్క అడుగు’ అనే సినిమా తీయాలను కున్నారు. క‌థ రెడీ చేశారు కానీ.. కొన్ని కార‌ణాల వ‌ల‌న ఈ ప్రాజెక్ట్ సెట్ కాలేదు. ఈ క‌థ‌కు త‌నే ద‌ర్శ‌క‌త్వం వ‌హించాలనుకున్నారు. అలాగే ‘విశాల నేత్రాలు’ అనే క‌థ కూడా రెడీ చేశారు. ఇక‌ కృష్ణంరాజు కెరీర్ లో ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేని చిత్రం ‘భ‌క్త క‌న్న‌ప్ప‌’. ఈ సినిమాను  కూడా ప్ర‌భాస్ తో చేయాలనుకున్నారు. ఎప్ప‌టి నుంచో ఈ సినిమాలు చేయాలనుకున్నా కుదరలేదు.

ఇక రాజ‌కీయం విష‌యానికి వ‌స్తే… కృష్ణంరాజును గ‌వ‌ర్న‌ర్ గా నియ‌మించాల‌ని బీజీపీ అనుకుంది. వార్త‌లు కూడా వ‌చ్చాయి. అయితే.. లాస్ట్ మినిట్ లో ఎందుక‌నో మిస్ అయ్యింది. ఆయ‌న కూడా గ‌వ‌ర్న‌ర్ పదవి తనకు ఖాయమని బలంగా నమ్అమారు. కానీ.. గ‌వ‌ర్న‌ర్ కాకుండానే ఆయ‌న వెళ్లిపోయారు.

Also Read:కృష్ణంరాజుకు రాజకీయ, సినీ ప్రముఖుల నివాళి (దృశ్య మాలిక)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular