Thursday, May 30, 2024
Homeసినిమాబ్ర‌హ్మ‌స్త్ర క‌లెక్ష‌న్ ఎంత‌?

బ్ర‌హ్మ‌స్త్ర క‌లెక్ష‌న్ ఎంత‌?

బాలీవుడ్ లో తెర‌కెక్కిన భారీ బ‌డ్జెట్ మూవీ ‘బ్ర‌హ్మ‌స్త్ర‌‘. ఇందులో ర‌ణ్ బీర్ క‌పూర్, ఆలియా భ‌ట్ జంట‌గా న‌టించారు. ‘నాగార్జున‌, అమితాబ్ కీల‌క పాత్రలు పోషించారు. అలాగే సౌత్ లో  రాజ‌మౌళి ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రించ‌డంతో సినిమాపై  మంచి క్రేజ్ ఏర్ప‌డింది. వ‌రుస‌గా ప్లాపుల‌తో స‌త‌మౌతున్న బాలీవుడ్ కి ‘బ్ర‌హ్మ‌స్త్రం’ భారీ విజ‌యాన్ని అందిస్తుంద‌ని చాలా ఆశ‌లు పెట్టుకున్నారు బాలీవుడ్ జ‌నాలు.

అయితే.. అక్కడ రివ్యూలు నెగిటివ్ గా రావ‌డంతో బాలీవుడ్ కి నిరాశ త‌ప్పదనిపించింది కానీ.. సినిమా కలెక్షన్లు మాత్రం జోరుగానే సాగుతున్నాయి. మొదటి రెండు రోజుల్లోనే 160 కోట్ల ఆదాయాన్ని ఈ సినిమా వసూలు చేసినట్టు సమాచారం. వారాంతానికి రూ.250 కోట్లను చేరుకుంటుందన్న అంచనాలు నెలకొన్నాయి. బ్రహ్మాస్త్ర సినిమా అధికారిక ట్విట్టర్ పేజీ.. రెండు రోజుల్లో బాక్సాఫీసు 160 కోట్ల వసూళ్లను నమోదు చేసిందంటూ ఓ గ్రాఫిక్ ఇమేజ్ ను పోస్ట్ చేసింది.

హిందీ వెర్షన్ కు డబ్బింగ్ గా తమిళనాడులో విడుదల కాగా, అక్కడ కూడా బ్రహ్మాస్త్ర రికార్డులు తిరగరాస్తోంది. 1.20 కోట్లను మొదటి రోజే రాబట్టింది. తమిళనాట ఓ బాలీవుడ్ సినిమాకు వచ్చిన మొదటి రోజు అత్యధిక ఆదాయం ఇదేనట. ఈ సినిమాను  తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడలోనూ విడుదల చేశారు. ఇప్పుడున్న క‌లెక్ష‌న్స్ చూస్తుంటే.. రెండో వారంలో కూడా బ్ర‌హ్మ‌స్త్రం అదిరిపోయే క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేయ‌డం ఖాయం అనిపిస్తుంది. మ‌రి.. బ్ర‌హ్మాస్త్రం ఎలాంటి రికార్డులు సెట్ చేస్తుందో చూడాలి.

Also Read: కథ కొంచెం .. గ్రాఫిక్స్ ఘనం .. ‘బ్రహ్మాస్త్రం’

RELATED ARTICLES

Most Popular

న్యూస్