Wednesday, May 8, 2024
Homeసినిమామెగాస్టార్ మూవీలో వెంక‌టేష్‌?

మెగాస్టార్ మూవీలో వెంక‌టేష్‌?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ డైరెక్ష‌న్ లో ‘వాల్తేరు వీర‌య్య‘ సినిమా రూపొందుతోంది. ఇందులో చిరంజీవి స‌ర‌స‌న అందాల తార శృతిహాస‌న్ న‌టిస్తోంది. ర‌వితేజ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్న ఈ  సినిమాపై మంచి  అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

చిరంజీవి – రవితేజ పాత్రల మధ్య  ఎమోషనల్ సీన్స్ కూడా ఉంటాయట. ఇంటర్వెల్ లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ లో రవితేజ పాత్ర ఈ సినిమాలో రివీల్ అవుతుందట. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్‌ లో రవితేజ, చిరంజీవిల పై కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ మూవీలో విక్ట‌రీ వెంక‌టేష్ న‌టించ‌నున్నార‌ని ఓ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ సినిమా క్లైమాక్స్ లో హీరో వెంకటేష్ కూడా సరదాగా ఓ అతిథి పాత్రలో కనిపిస్తారట.

ప్రస్తుతానికి ఈ వార్తకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు కానీ… టాలీవుడ్ లో మాత్రం ఈ వార్త గ‌ట్టిగా వినిపిస్తుంది. మొత్తం షూటింగ్ కంప్లీట్ అయిన త‌ర్వాత చిరు, వెంకీ పై సీన్స్ షూట్ చేస్తార‌ని టాక్ వినిపిస్తుంది. ఇదే క‌నుక నిజ‌మైతే.. వాల్తేరు వీర‌య్య మూవీకి మ‌రింత క్రేజ్ రావ‌డం ఖాయం.

Also Read:వాల్తేరు వీర‌య్య‌లో ర‌వితేజ న‌టిస్తున్నాడా లేదా

RELATED ARTICLES

Most Popular

న్యూస్