Saturday, January 18, 2025
Homeతెలంగాణఎక్స్ ప్రెస్ వే ర్యాంప్ లు ప్రారంభం

ఎక్స్ ప్రెస్ వే ర్యాంప్ లు ప్రారంభం

పీవీఎన్ఆర్ ఎక్స్ ప్రెస్ వేపై రూ.22.08కోట్ల వ్యయంతో నిర్మించిన అదనపు ర్యాంపులను ఉప్పర్ పల్లి వద్ద మున్సిపల్ శాఖ మంత్రి కేటియార్ ప్రారంభించారు.  మెహదీపట్నం నుంచి రాజేంద్రనగర్ అరాంఘర్ వరకు 11.6 కి.మీ పొడువైన పివి ఎన్ అర్ ఎక్స్ ప్రెస్ వే కి ఇరువైపుల ఎక్కి, దిగేందుకు ర్యాంపులను హెచ్ఎండిఎ నిర్మించింది.

గతేడాది ఫిబ్రవరి నెల్లో అదనంగా ఆప్ అండ్ డౌన్ ర్యాంపుల నిర్మాణం ప్రారంభించారు. మెహదీపట్నం నుంచి ఎయిర్ పోర్టుకు వెళ్లే మార్గంలో పిల్లర్ నెం. 161 వద్ద ఎక్స్ ప్రెస్ వే పైకి ఎక్కేలా ,  ఎయిర్ పోర్టు నుంచి వస్తున్న క్రమంలో అత్తాపూర్ వద్ద దిగేలా పిల్లర్ నెం. 163 దిగేందుకు ఈ ర్యాంపులను హెచ్ఎండీఏ నిర్మించింది.

కొత్తగా నిర్మించిన ఈ ర్యాంపుల ద్వారా పరిసర ప్రాంతాల ప్రజల రాకపోకలకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. ప్రయాణ సమయం కూడా తగ్గుతుంది. కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, మేయర్ విజయలక్ష్మి, ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, ప్రకాష్ గౌడ్, ఎమ్మెల్సీలు సురభి వాణిదేవి, పట్నం మహేందర్ రెడ్డి, ఎగ్గే మల్లేశం, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్