Thursday, May 30, 2024
Homeసినిమాసంజయ్ రావ్ కొత్త చిత్రం

సంజయ్ రావ్ కొత్త చిత్రం

‘ఓ పిట్టకథ’ సినిమాతో హీరోగా మంచి ఇమేజ్ తెచ్చుకున్న బ్రహ్మాజీ తనయుడు సంజయ్ రావ్ హీరోగా మరో కొత్త సిసిమా తెరకెక్కుతోంది. వి.ఎస్. ఫణీంద్రన్ దర్శకత్వంలో నేహా ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై  ప్రొడ్యూసర్ కమ్మరి.రవికుమార్ నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెo.1 చిత్రం షూటింగ్ మొదలు త్వరలో కాబోతుంది. సంజయ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్లుగా రోహిణి ముంజల్, సాధన నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో  రాజా రవీంద్ర, ప్రభాస్ శ్రీను, హేమ, ప్రగతి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

నిర్మాత రవికుమార్ మాట్లాడుతూ ‘ప్రతి ఒక్కరి జీవితంలో అవసరమైనది ప్రేమా? పెళ్ళా? అనే కధాంశంతో, లవ్ అండ్ ఫ్యామిలీ ఓరియెంటెడ్ గా తెరకెక్కించే సన్నాహాలు చేస్తున్నాం, కరోనా సెకండ్ వేవ్ తీవ్రత తగ్గిన తరువాత షూటింగ్ మొదలుపెడతాం’ అన్నారు.

దర్శకుడు వి ఎస్ ఫణింద్రన్ మాట్లాడుతూ ‘సరికొత్త కథా కథనంతో తెరకెక్కించే సినిమా ఇది. ఈ కథ చాలా ఆసక్తికరంగా సాగుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఎదురయ్యే ఆసక్తికర ప్రశ్న ? అదే అంశంతో ఈ సినిమా తెరకెక్కనుంది’ అని వెల్లడించారు.

ఈ చిత్రానికి సంగీతం ” ప్రణవ్ దాశరథి, లిరిక్స్ : శ్రీరామ్ తపస్వి,  కెమెరా. అనిల్, ఎడిటర్ : రామారావు, పి ఆర్ ఓ: సురేష్ కొండేటి, నిర్మాత: కమ్మరి రవికుమార్,  రచన, దర్శకత్వం : వీ.ఎస్.ఫణీంద్రన్

RELATED ARTICLES

Most Popular

న్యూస్