Tuesday, June 9, 2026
Homeసినిమా‘బంగార్రాజు’ డైరెక్ట‌ర్ త‌దుప‌రి చిత్రం ఫిక్స్

‘బంగార్రాజు’ డైరెక్ట‌ర్ త‌దుప‌రి చిత్రం ఫిక్స్

Big Offer: నాగార్జున, నాగచైతన్య నటించిన `బంగార్రాజు`తో సంక్రాంతి బ్లాక్ బస్టర్ అందించిన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తన తదుపరి చిత్రం అగ్ర నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ ప్రొడక్షన్ లో చేయనున్నారు. కెఇ జ్ఞానవేల్ రాజా ఈ చిత్రానికి నిర్మాత. దక్షిణాది చలనచిత్ర రంగంలో ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన స్టూడియో గ్రీన్, స్టార్ హీరోలతో హై బడ్జెట్ ఎంటర్టైనర్లను నిర్మించడమే కాకుండా కంటెంట్ రిచ్ సినిమాలను నిర్మిస్తోంది. తెలుగులో కూడా అంతే ప్రజాదరణ పొందిన ఈ బ్యానర్ నిర్మించిన పలు చిత్రాలు ఇక్కడ డబ్ చేసి విడుదలయ్యాయి.

ఈ సందర్భంగా కెఇ జ్ఞానవేల్ రాజా మాట్లాడుతూ… “సంక్రాంతికి బ్లాక్బస్టర్ హిట్ ఇచ్చిన దర్శకుడు కళ్యాణ్ కృష్ణతో మా బ్యానర్లో భారీ సినిమా చేయనున్న విషయాన్ని సంతోషంగా ప్రకటిస్తున్నాం. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తాం” అన్నారు.

పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లను రూపొందించడంలో పేరుగాంచిన కళ్యాణ్ కృష్ణ, బంగార్రాజు సినిమాని అంద‌రికీ న‌చ్చేలా తెర‌కెక్కించి ప్రశంసలు అందుకున్నాడు. ఇది భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక క‌ళ్యాణ్ కృష్ణ చేయ‌నున్న త‌దుప‌రి చిత్రానికి సంబందించిన ఇతర వివరాలు త్వరలో స్టూడియో గ్రీన్ వారు వెల్లడించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular