Tuesday, October 3, 2023
Homeసినిమాస‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ‘ఇంటి నెం.13’ టీజ‌ర్ రిలీజ్‌

స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ‘ఇంటి నెం.13’ టీజ‌ర్ రిలీజ్‌

House No.13: ‘కాలింగ్‌ బెల్‌’, ‘రాక్షసి’ చిత్రాల‌తో టాలెంటెడ్ డైరెక్ట‌ర్‌గా ప్రూవ్ చేసుకున్న యంగ్ డైరెక్ట‌ర్ ప‌న్నా రాయ‌ల్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన మ‌రో డిఫ‌రెంట్ మూవీ ‘ఇంటి నెం.13’ . ఇటీవ‌ల విడుద‌లైన ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌కి ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఫ‌స్ట్ లుక్‌తోనే ప‌న్నా రాయ‌ల్ నుంచి మ‌రో డిఫ‌రెంట్ మూవీ రాబోతోంద‌ని అర్థ‌మైంది. ఈ నేప‌థ్యంలోనే సంక్రాంతి కానుక‌గా ‘ఇంటి నెం.13’ టీజ‌ర్‌ను విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌. టీజ‌ర్ చూసిన ప్ర‌తి ఒక్క‌రికీ ఈ సినిమా ఓ కొత్త ట్రెండ్‌ని క్రియేట్ చెయ్య‌బోతోంద‌ని అర్థ‌మ‌వుతుంది. సినిమాటోగ్ర‌ఫీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆడియ‌న్స్‌ ని మెస్మ‌రైజ్ చేసేలా ఉన్నాయి. ఈ టీజ‌ర్ విడుద‌లైన క్ష‌ణం నుంచి సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఈ చిత్రాన్ని రీగల్‌ ఫిలిం ప్రొడక్షన్స్‌ పతాకంపై హేసన్‌ పాషా నిర్మిస్తున్నారు.

ద‌ర్శ‌కుడు ప‌న్నా రాయ‌ల్ మాట్లాడుతూ “ప్రేక్ష‌కుల‌కు ఓ కొత్త అనుభూతిని అందించాల‌న్న ల‌క్ష్యంతో రూపొందించిన సినిమా ఇది. మిస్టీరియ‌స్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా ఓ డిఫ‌రెంట్ ఎక్స్‌ పీరియ‌న్స్‌ ని ఇస్తుంది. టీజ‌ర్ రిలీజ్ అయిన త‌ర్వాత వ‌స్తున్న రెస్పాన్స్ చూస్తుంటే.. చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా కంటెంట్ ప‌రంగానే కాదు, టెక్నిక‌ల్‌గా కూడా చాలా హై రేంజ్‌లో ఉంటుంది. ఆడియ‌న్స్‌ కి ఓ హాలీవుడ్ సినిమా చూస్తున్న ఫీలింగ్ క‌లుగుతుంది అన్నారు.

నిర్మాత హేస‌న్ పాషా మాట్లాడుతూ “ఈ రోజు టీజ‌ర్‌ను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌చ్చాం. మేం ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వ‌స్తోంది. మా బేన‌ర్ నుంచి ఓ డిఫ‌రెంట్ మూవీని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. త్వ‌ర‌లోనే ఈ సినిమా ట్రైల‌ర్‌ను కూడా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. ట్రైల‌ర్ రిలీజ్‌తో ఈ సినిమా పై ఆడియ‌న్స్ ఎక్స్‌ పెక్టేష‌న్స్ మ‌రింత పెరుగుతాయ‌న్న న‌మ్మ‌కం ఉంది. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసి త్వ‌ర‌లోనే ఈ సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తాం” అన్నారు.

Also Read : ఆ స్పంద‌న మ‌ర‌చిపోలేక‌పోతున్నా : అశోక్ గ‌ల్లా

NewsDesk
NewsDesk
'ఐ'ధాత్రి న్యూస్ డెస్క్ లో అనుభవజ్ఞులయిన జర్నలిస్టులు, కాపీ ఎడిటర్లు, అనువాదకులు, డిజైనర్లు, డిజిటల్ మీడియా సాంకేతిక నిపుణులు పనిచేస్తుంటారు.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Ramaraju on జనం భాష
Ramaraju on జనం భాష
Radhakrishna Regalla on లోహం- వ్యామోహం
ఆకతాఈ శ్రీ on తెలుగు వెలుగు
Indrasen Bejjarapu on మనసున్న పులి
ఎమ్వీ రామిరెడ్డి on మనసున్న పులి
ఫణీన్ద్ర పురాణపణ్డ on హంపీ వైభవం-1
Radhakrishna Regalla on హంపీ వైభవం-2
Radhakrishna Regalla on హంపీ వైభవం-2
Dr MVJM RAMA PRASAD MANDA on హంపీ వైభవం-2
Radhakrishna Regalla on హంపీ వైభవం-1
తనికెళ్ల శ్రీనివాస్ on రెండు వ్రాతప్రతులూ అపూర్వమే !
కర్రా వెంకటరత్నం on మా నాన్న