Sunday, January 19, 2025
HomeTrending Newsరైతుల కళ్ళల్లో ఆనందం...: కన్నబాబు

రైతుల కళ్ళల్లో ఆనందం…: కన్నబాబు

రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు వెల్లడించారు. వ్యవసాయ రంగ అభివృద్ధికి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నామన్నారు.  రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పునరుద్ఘాటించారు. తమది రైతు పక్షపాత ప్రభుత్వమని సిఎం జగన్ బహిరంగంగా ప్రకటించిన విషయాన్ని అయన గుర్తు చేశారు. రైతు సమస్యలపై సిఎం జగన్ కు టిడిపి నేతలు చింతకాయల అయ్యన్నపాత్రుడు, దేవినేని ఉమా రాసిన లేఖలపై కన్నబాబు స్పందించారు. వారికి పనీపాటా లేక కేవలం ఉనికి కోసమే ఇలాంటి లేఖలు తాస్తూ కాలం గడుపుతున్నారని కన్నబాబు మండిపడ్డారు.

రాష్ట్రంలో పంటల సాగు బాగుందని,  రైతులు బాగున్నారని, కేవలం గంజాయి సాగుమీద ఆధారపడిన టిడిపి నాయకులే బాధపడుతున్నారని, ఎత్తి పరిస్థితులలోనూ రాష్ట్రంలో గంజాయి సాగును జరగనీయబోమని స్పష్టం చేశారు.  అనంతపురం జిల్లాలో 10 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని వారు ఆరోపించడం విడ్డూరంగా ఉందన్నారు. కోస్తా జిల్లాల్లో వేలాది ఎకరాల్లో క్రాప్ హాలిడే ప్రకటించారంటూ టిడిపి నేతలు చేస్తున్న ప్రకటనలను కన్నబాబు తప్పుబడుతూ ఎక్కడ ప్రకటించారో చూపాలని డిమాండ్ చేశారు. మోటార్లకు మీటర్లు బిగించడం వల్ల ఒక్క రైతుకన్నా రూపాయి అదనపు భారం పడిందేమో చూపాలని సవాల్ చేశారు. గత ప్రభుత్వం దిగిపోయే ముందు రైతుల నుంచి సేకరించిన ధాన్యం విలువ  9,362 కోట్ల రూపాయలని, 2020-21 సంవత్సరానికి 15,487 కోట్ల రూపాయల వరిధన్యాన్ని రైతుల నుంచి తాము కొనుగోలు చేశామని వివరించారు.  ఉత్తరాలు రాసేముందు ఈ వివరాలు సరిచూసుకోవాలని అయ్యన్నపాత్రుడు, దేవినేని ఉమా లకు కన్నబాబు సూచించారు. రైతులపై టిడిపిది కేలవం కపట ప్రేమ అని కన్నబాబు అభివర్ణించారు.

క్రాప్ ఇన్సూరెన్స్, ఇన్ పుట్ సబ్సిడీ, వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలతో రైతాంగానికి  అండగా నిలుస్తున్నామని చెప్పారు. రైతుల గుండెల్లో నాడు వైఎస్ కు ప్రత్యేక స్థానం ఉండేదని, ఇప్పుడు సిఎం జగన్ అంతకు మించి రైతులకు మేలు చేస్తున్నారని  చెప్పిన కన్నబాబు రైతుల గురించి మాట్లాడే అర్హత తెలుగుదేశం నేతలకు లేదన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్