Saturday, November 23, 2024
HomeTrending Newsబ్రిటన్ ఎన్నికల్లో రిషి సునాక్ పార్టీ ఓటమి

బ్రిటన్ ఎన్నికల్లో రిషి సునాక్ పార్టీ ఓటమి

బ్రిటన్ లో 14 ఏళ్ళుగా అధికారం చెలాయించిన కన్జర్వేటివ్‌ పార్టీకి భారీ ఓటమి ఎదురైంది. కీర్‌ స్టార్మర్‌ నేతృత్వంలోని లేబర్‌ పార్టీ ఘన విజయం సాధించింది. ప్రధాని అభ్యర్థి కీర్‌ స్టార్మర్‌ గెలుపొందారు. 650 స్థానాలున్న బ్రిటన్‌ పార్లమెంటులో అధికారం చేపట్టడానికి 326 సీట్లు కావాల్సి ఉంటుంది.

రెండేళ్ళ క్రితం ప్రధాని పదవి చేపట్టిన రిషి సునాక్ నిర్ణయాలు పార్టీ ఓటమికి కారణాలని విశ్లేషణ జరుగుతోంది. ఎన్నికల ప్రకటన వెలువడిన నాటి నుంచే  ఎగ్జిట్‌పోల్స్‌ లేబర్ పార్టీకి విజయం దక్కుతుందని ప్రకటించాయి.

14 ఏండ్లుగా టోరీలు అధికారంలో ఉండటం, సునాక్‌కు సవాల్‌గా మారింది. సునాక్‌(44), ఆయన భార్య అక్షతా మూర్తి ఉత్తర ఇంగ్లాండ్‌లోని యార్క్‌షైర్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజల తీర్పును గౌరవిస్తూ.. ఓటమికి బాధ్యత వహిస్తున్నా అంటూ రిషి సునాక్.. పార్టీ కార్యకర్తలు, నాయకులకు క్షమాపణలు తెలిపారు.

Conservative Party – 119

Labour Party – 410

Scottish Nationalist Party (SNP) – 8

Liberal Democrats – 58

Reform UK – 4

Others – 1

బ్రిటన్‌ కాలమానం ప్రకారం గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమైంది. రాత్రి 10 గంటల వరకు కొనసాగింది. దాదాపు 4.6 కోట్ల మంది ఓటర్లు ఉండగా, ఈసారి 2019తో పోలిస్తే తక్కువ పోలింగ్‌ నమోదైంది. గత ఎన్నికల్లో అది 67 శాతంగా ఉన్నది.

భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు దూరపు బంధువు ఉదయ్‌ నాగరాజు, బ్రిటన్‌ ఎంపీ ఎన్నికల్లో నిలబడ్డారు. కరీంనగర్‌ జిల్లా కోహెడ మండలంలోని శనిగరం గ్రామానికి చెందిన నాగరాజు, ఆయన కుటుంబ సభ్యులు కొన్నేండ్ల క్రితం బ్రిటన్‌లో స్థిరపడ్డారు. ఆయన లేబర్‌ పార్టీ తరఫున ఉత్తర బెడ్‌ఫోర్డ్‌షైర్‌ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. 45 ఏండ్ల ఉదయ్‌ నాగరాజ్‌ శుక్రవారం ఉదయం వెలువడి ఫలితాల్లో కన్జర్వేటివ్‌ పార్టీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. కన్జర్వేటివ్‌ పార్టీకి చెందిన రిచర్డ్‌ పుల్లర్‌ 19,981 ఓట్లతో విజయం సాధించగా, నాగరాజు 14,567 ఓట్లు సాధించారు.

నిజామాబాద్‌ జిల్లా కోటగిరికి చెందిన చంద్ర కన్నెగంటి.. కన్జర్వేటివ్‌ పార్టీ తరఫున స్టోక్‌ ఆన్‌ ట్రెంట్‌ సెంట్రల్‌ స్థానం నుంచి పోటీచేశారు. అయితే 6221 ఓట్లతో మూడో స్థానానికి పరిమితమయ్యారు. ఇక్కడ లేబర్‌ పార్టీ అభ్యర్థి గారెత్‌ స్నెల్‌ విజయం సాధించారు. ఉన్నత విద్యకోసం లండన్‌ వెళ్లిన చంద్ర అక్కడే స్థిరపడ్డారు. జనర్‌ ప్రాక్టిషనర్‌గా సేవలందిస్తూనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. స్టోక్‌ ఆన్‌ ట్రెంట్‌లో రెండు సార్లు కౌన్సిలర్‌గా, ఒకసారి మేయర్‌గా పనిచేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్