Sunday, June 14, 2026
Homeసినిమాలేడీ లయన్ క్రియేషన్స్ లోగో విడుదల

లేడీ లయన్ క్రియేషన్స్ లోగో విడుదల

నవతరాన్ని చైతన్య పరిచే  సినిమాల నిర్మాణానికి ఉద్భవించింది లేడీ లయన్ క్రియేషన్స్…. నిర్మాత జి.ఆర్.జి.ఎన్ రాజు ఈ సంస్థను ప్రారంభించారు.  లేడి లయన్ క్రియేషన్స్ బ్యానర్ గ్రాండ్ లాంచ్ కార్యక్రమం ప్రసాద్ లాబ్స్ లో జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిధులుగా ప్రముఖ నిర్మాత కె ఎస్ రామారావు, రమేష్ ప్రసాద్, తమ్మారెడ్డి భరద్వాజ, దర్శకుడు వీర శంకర్, తెలంగాణ సాంస్కృతిక శాఖ చైర్మన్ మామిడి హరికృష్ణ, మాదాల రవి, నాగబాల సురేష్ కుమార్ లతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా బ్యానర్ లోగో ను కె ఎస్ రామారావు విడుదల చేయగా, టీజర్ ను తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేశారు.

అనంతరం సీనియర్ నిర్మాత కె ఎస్ రామారావ్ మాట్లాడుతూ.. లేడి లయన్ అనే బ్యానర్ మొదలెట్టి నిర్మాత రాజు, దర్శకుడు చల్లా భాను కిరణ్ సరికొత్త తరహా చిత్రాలను నిర్మించేందుకు సిద్దమయ్యారు, వారికి అభినందనలు తెలిపారు.

తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. ఆడ సింహం అంటూ అదిరిపోయే బ్యానర్ ని మొదలెట్టిన నిర్మాత రాజు గారికి, దర్శకుడు చల్లా భానులకు అభినందనలు. ఈ బ్యానర్ పై సరికొత్త తరహా చిత్రాలు రావాలని కోరుకుంటున్నాను. తప్పకుండా ఇండస్ట్రీ లో ఈ బ్యానర్ తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేయాలనీ కోరుతున్నాను అన్నారు.

నిర్మాత రాజు మాట్లాడుతూ .. లేడి లయన్ బ్యానర్ పై సరికొత్త తరహా చిత్రాలు తెరకెక్కించే ఉద్దేశంతో ఈ బ్యానర్ ని మొదలు పెట్టాం. సినిమాలే కాకుండా ఓటిటి కోసం వెబ్ సిరీస్ లను కూడా నిర్మిస్తున్నాం. చల్లా భాను కిరణ్ దర్శకత్వంలో మా ప్రయత్నంగా ‘లవ్ యూ ఎనిమి’ అనే వెబ్ సిరీస్ త్వరలో విడుదల అవుతుంది అన్నారు.

చల్లా భాను కిరణ్ మాట్లాడుతూ.. రాజు గారు కొత్త టాలెంట్ ని పరిచయం చేసేందుకు ఈ బ్యానర్ ని మొదలెట్టారు. తప్పకుండా ఈ బ్యానర్ పై భిన్నమైన సినిమాలు వస్తాయి. ఈ లోగో లాంచ్ వేడుకకు వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అన్నారు. ఈ కార్యక్రమంలో మాదాల రవి, రమేష్ ప్రసాద్, వీర శంకర్, లంక దాసరి ప్రసాదరావు ( మాజీ మున్సిపల్ చైర్మన్ గుడివాడ) తదితరులు చిత్ర యూనిట్ కు అభినందనలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular