బి. డబ్ల్యూ.ఎఫ్. వరల్డ్ ఛాంపియన్ షిప్స్-2022లో నేడు మూడోరోజు ఇండియాకు నాలుగు విజయాలు, ఐదు అపజయాలు ఎదురయ్యాయి. పురుషుల సింగిల్స్ లో లక్ష్య సేన్, హెచ్ ఎస్ ప్రణయ్, పురుషుల డబుల్స్ లో సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి; ఎమ్మార్ అర్జున్- ధృవ్ కపిల జోడీలు విజయం సాధించి తర్వాతి రౌండ్ లోకి ప్రవేశించారు.
మహిళల డబుల్స్ లో అశ్విని పొన్నప్ప-సిక్కీరెడ్డి; గాయత్రి గోపీచంద్-జాలీ; అశ్విని భట్-శిఖా గౌతమ్; పూజా దండు- సంజన సంతోష్ జంటలు…. పురుషుల సింగిల్స్ లో తెలుగు తేజం కిడాంబి శ్రీకాంత్ లు తమ ప్రత్యర్థుల చేతిలో ఓటమి పాలయ్యారు.
- హెచ్ ఎస్ ప్రణయ్ 21-17;21-16 తో జపాన్ క్రీడాకారుడు కెంటో మోమోటా పై….. లక్ష్య సేన్ 21-17, 21-10 తో స్పెయిన్ ఆటగాడు లూయీస్ పెనాల్వేర్ పై విజయం సాధించారు.
- పురుషుల డబుల్స్ లో సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి ద్వయం21-8;21-10 తేడాతో గ్వాటెమాలా జోడీ జోనాథన్ సోలీస్- అనిబల్ మర్రోక్విన్ పై గెలుపొందారు.
- మరో మ్యాచ్ లో ఎమ్మార్ అర్జున్- ధృవ్ కపిల జంట 21-17;21-16 తో డెన్మార్క్ ఆటగాళ్ళు కిమ్ ఆస్ట్రప్-స్కారప్ రస్సుంసేన్ పై విజయం సొంతం చేసుకున్నారు.
రేపు జరగబోయే ప్రీ క్వార్టర్స్ లో ఇండియా ద్వయం లక్ష్య సేన్- ప్రణయ్ లు ముఖాముఖి తలపడనున్నారు.
Also Read : సైనా, గాయత్రి-జాలీ జోడీ విజయం