Friday, March 29, 2024
Homeసినిమాఅదే.. లక్ష్య థీమ్….. నాగ‌శౌర్య‌

అదే.. లక్ష్య థీమ్….. నాగ‌శౌర్య‌

Lakshya – aim for hit
నాగశౌర్య హీరోగా సంతోష్ జాగర్లమూడి తెరకెక్కించిన చిత్రం లక్ష్య. కేతికశర్మ హీరోయిన్‌గా నటించింది. సోనాలి నారంగ్ సమర్ఫణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై…నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మించారు. డిసెంబర్ 10న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమా విడుదల సందర్భంగా హీరో నాగ‌శౌర్య మీడియాతో మాట్లాడారు ఆ విశేషాలు ఆయ‌న మాట‌ల్లోనే…

‘వరుడు కావలెను’ నా పరిధికి సంబంధించినది. అలాంటి సబ్జెక్ట్ ఎన్నిసార్లు చేసినా సక్సెస్ అవుతుందన్న నమ్మకం దర్శక నిర్మాతలకు ఉంది. ఆ నమ్మకాన్ని ప్రేక్షకులు మరోసారి నిరూపించారు. ఇప్పుడు ‘లక్ష్య’ రాబోతోంది, ఇది ఇంకా పెద్ద సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నాను. కథ విన్న వెంటనే నా వైపు నుంచి వంద శాతమివ్వాలని అనుకున్నాను. కొత్త నాగ శౌర్యను చూపించాలని అనుకున్నాను. ఇలాంటి కథలు రావడమే అదృష్టం. ఇలాంటివి వచ్చినప్పుడు యాక్టర్స్ ఎవ్వరైనా ఓ అడుగు ముందుకు వేస్తారు. నేను కూడా అదే చేశాను.

ముందు ఏసియన్ సునీల్ గారు ఫోన్ చేశారు. ఓ కథ ఉంది వెంటనే వినాలని అన్నారు. సంతోష్ గారు వచ్చి దాదాపు నాలుగు గంటల పాటు ఫస్ట్ హాఫ్‌ను నెరేట్ చేశారు. ప్రతీది విడమరిచి చెప్పారు. బాణం ఎలా పట్టుకోవాలి.. ఎలా నిల్చోవాలి అంటూ ఇలా అన్నీ వివరించి చెప్పారు. కథ బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పాను. ఆర్చరీ మనకు తెలియంది కాదు. పురాణాల నుంచి మనం చూస్తూనే ఉన్నాం.. మన వీరుల చేతుల్లో విల్లు ఉంటుంది. నిన్న విడుదలైన ఆర్ఆర్ఆర్ ట్రైలర్‌లోనూ రామ్ చరణ్ గారు బాణంతో కనిపించారు. అన్నింటిని ఆటలు అని అంటాం కానీ ఒక్క ఆర్చరీని మాత్రమే విలు విద్య అని అంటాం. దాన్ని మనం ఎడ్యుకేషన్‌గా గౌరవిస్తాం. మన వాళ్లు దాన్ని మరిచిపోయారు. కాస్త గుర్తు చేద్దామని ఈ సినిమా తీశాం.

ఏ ఆట అయినా సరే ప్రొఫెషనల్‌గా వెళ్లాలంటే చాలా కష్టం. కానీ ఈ సినిమా కోసం ఆర్చరీని నేర్చుకున్నాను. 35 కేజీలను వెనక్కి లాగడం మామూలు విషయం కాదు. ఎన్నో గాయాలు కూడా అవుతుంటాయి. ఈ సినిమా కోసం మూడు రోజులు మాత్రమే శిక్షణ తీసుకున్నాను. కొత్తదనం చూపించేందుకే ఈ సినిమాను చేశాం. ‘సై’ సినిమానే మాకు స్ఫూర్తి. ఎవ్వరికీ తెలియని ఆటను తీసుకొచ్చి కమర్షియల్‌గా జోడించి అద్బుతంగా చూపించారు. నెరేషన్ బాగుంటే సినిమా అద్బుతంగా వస్తుంది. అందులో సంతోష్ సక్సెస్ అవుతాడని నమ్మకం ఉంది.

Lakshya

దేశంలోనే ఆర్చరీ నేపథ్యంలో రాబోతోన్న మొదటి సినిమా లక్ష్య. నా కెరీర్‌లోనూ స్పోర్ట్స్ బేస్డ్ సినిమాను చేయడం ఇదే మొదటి సారి. ఇది వరకు కూడా క్రీడా నేపథ్యంలోని కథలు నా వద్దకు వచ్చాయి. కానీ ఇది బాగా నచ్చింది. అందరూ తామెంటో ప్రపంచానికి నిరూపించాలని అనుకుంటారు. అలానే పార్థు కూడా ప్రపంచానికి తన సత్తా చూపించే ముందు తనలోని చెడుని ఎలా గెలిచాడు.. చివరకు ప్రపంచాన్ని ఎలా గెలిచాడు అనేది లక్ష్య థీమ్.

ఈ సినిమాకు ముగ్గురు నిర్మాతలు. వారి వల్లే సినిమా ఇంత బాగా వచ్చింది. ఫోటో షూట్ చేసినప్పుడు భయంకరంగా కరోనా ఉంది. అయినా నా కోసం రూం అంతా కూడా రెండు రోజులు శానిటైజ్ చేసి పెట్టారు. ఎక్కువమంది లేకుండా ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు. దర్శకుడు, హీరోకు నచ్చినట్టు సినిమా తీయడానికి స్వేచ్చను ఇచ్చారు. కేతిక శర్మ ‘రొమాంటిక్’తో బాగా అందరికీ రీచ్ అయ్యారు. ‘ఊహలు గుసగుసలాడే’ నాకు చాలా కాలం గుర్తుండిపోయింది. కేతిక శర్మకు రొమాంటిక్ సినిమా అలా గుర్తుండిపోతుంది. కేతిక శర్మ చాలా అందంగా ఉంటుంది. చక్కగా నటించింది.

ఐరా ప్రొడక్షన్స్ నెంబర్ 4 గా ఓ సినిమాను చేస్తున్నాను. ఇందులో బ్రాహ్మిణ్ కారెక్టర్‌ను పోషిస్తున్నాను. నాకు చాలా న‌చ్చిన క‌థ‌. ‘పలానా అమ్మాయి పలానా అబ్బాయి’ నాకు ఎంతో దగ్గరైన సినిమా. నటుడిగా నాకు ఎంతో సంతృ‌ప్తినిచ్చింది. ఇందులో ఏడు రకాల వేరియేష‌న్స్ ఉంటాయి. ఈ సినిమాను నా ముందు జనరేషన్స్‌కి, నా కుటుంబానికి చూపించుకునే మంచి సినిమా అవుతుంది. బాలయ్య గారితో సినిమా అనేది కేవలం రూమర్. ఏసియన్ నా హోం బ్యానర్. ఎన్ని సినిమాలైనా చేయొచ్చు… అంటూ పలు విశేషాలు వెల్లడించాడు నాగ శౌర్య.

Also Read : మెగాస్టార్  చెప్పినట్లు నాగ‌శౌర్య‌ సూపర్‌ స్టార్‌ అవుతాడు : శ‌ర్వానంద్‌ ‌

RELATED ARTICLES

Most Popular

న్యూస్