Monday, March 4, 2024
Homeసినిమా'లాల్ స‌లాం' షూటింగ్ ప్రారంభం

‘లాల్ స‌లాం’ షూటింగ్ ప్రారంభం

పాన్ ఇండియా ఆశ్చ‌ర్య‌పోయేలా భారీ బ‌డ్జెట్  విజువ‌ల్ వండ‌ర్స్ చిత్రాలే కాదు.. వెరైటీ కంటెంట్ చిత్రాల‌ను ప్రేక్ష‌కుల‌కు అందించ‌టానికి ఎప్పుడూ ఆస‌క్తి చూపించే లైకా ప్రొడ‌క్ష‌న్స్‌.  ఇప్పుడు ఈ నిర్మాణ సంస్థ‌లో ఐశ్వ‌ర్య రజినీకాంత్ ద‌ర్శ‌క‌త్వంలో ‘లాల్ సలాం’ సినిమా  రూపొందుతోంది. ఇటీవ‌ల పూజా కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ హోలీ సంద‌ర్భంగా సోమ‌వారం రోజున ప్రారంభ‌మైంది. విష్ణు విశాల్‌, విక్రాంత్ హీరోలుగా న‌టిస్తోన్న ఈ చిత్రంలో ర‌జినీకాంత్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు.

ఈ సందర్భంగా లైకా ప్రతినిధులు మాట్లాడుతూ.. ‘‘విభిన్నమైన సినిమాలకు లైకా ఎప్పుడూ ఆద‌ర‌ణ ఇస్తుంది. అందులో భాగంగా లాల్ స‌లాం సినిమాను నిర్మిస్తున్నాం. ఇందులో ఓ వ‌ప‌ర్‌ఫుల్ పాత్ర ఉంది. దాన్ని నెక్ట్స్ లెవ‌ల్‌కు తీసుకెళ్లే గొప్ప న‌టుడు కావాల‌ని, ర‌జినీకాంత్‌ గారిని రిక్వెస్ట్ చేశాం. మాతో ఉన్న అనుబంధంతో ఆయ‌న ఈ రోల్‌లో న‌టించ‌టానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. ఎనిమిదేళ్ల త‌ర్వాత ఐశ్వ‌ర్య ర‌జినీకాంత్ మ‌ళ్లీ మెగా ఫోన్ ప‌ట్టారు. మ‌రో లాల్ స‌లాం వంటి డిఫరెంట్ మూవీతో మ‌నల్ని అల‌రించ‌బోతున్నారు. ఈ చిత్రానికి ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. విష్ణు రామ‌స్వామి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు’’ అని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్