Monday, June 15, 2026
HomeTrending Newsమార్చి 23నుంచి జగనన్నకు చెబుదాం

మార్చి 23నుంచి జగనన్నకు చెబుదాం

జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని మార్చి 23నుంచి రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెడుతోంది.  ప్రభుత్వానికి వచ్చే ప్రతి అర్జీని సీరియస్ గా తీసుకొని  దాన్ని నిర్దిష్ట కాలపరిమితి లోగా పరిష్కరించేందుకు ఈ  కార్యక్రమాన్ని మొదలుపెడుతున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  నిర్ణయించిన సంగతి తెలిసిందే. మొదలుపెడుతున్నట్లు వెల్లడించారు. -సీఎంఓ అధికారులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. అసెంబ్లీ సమావేశాలు, మార్చి, ఏప్రిల్‌ నెలలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, అమలు చేయాల్సిన పథకాల తేదీల ఖరారు అంశాలపై సమీక్ష నిర్వహించారు.  ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌  ఎన్నికల కోడ్‌ ముగియనుండడంతో నిలిచిపోయిన కార్యక్రమాలను ఎప్పుడు అమలు చేయాలనే దానిపై చర్చించారు. ఎన్నికల కోడ్‌తో సంబంధం లేని కారణంగా మార్చి 10నుంచి మధ్యాహ్న భోజనంతోపాటుగా రాగిజావ అమలు ప్రారంభించనున్నారు.

ఈ సమావేశంలో తీసుకున్న పలు నిర్ణయాలు:

  •  మార్చి 14 నుంచి అసెంబ్లీలో సమావేశాల నిర్వహణకు నిర్ణయం.
  • బీఏసీ సమావేశంలో సమావేశాల షెడ్యూలు ఖరారు.
  • మార్చి 18 సంపూర్ణ ఫీజురీయింబర్స్‌మెంట్‌ పథకం… జగనన్న విద్యాదీవెన లబ్ధిదారుల ఖాతాల్లోకి డీబీటి పద్ధతిలో నగదు జమ.
  • మార్చి 22న ఉగాదిరోజున ఉత్తమ సేవలందించిన వాలంటీర్ల పేర్ల ప్రకటన. వీరికి ఏప్రిల్‌ 10న అవార్డులు, రివార్డులు.
  • మార్చి 23న జగనన్నకు చెబుదాం కార్యక్రమం ప్రారంభం.
  • మార్చి 25 నుంచి వైయస్సార్‌ ఆసరా. ఏప్రిల్‌ 5 వరకూ కొనసాగనున్న కార్యక్రమం.
  • మార్చి 31న జగనన్న వసతి దీవెన.
  • ఏప్రిల్‌ 6న ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ అమలు.
  • ఏప్రిల్‌ 10న వాలంటీర్లకు సన్మానం.
  • ఏప్రిల్‌ 18న ఈబీసీ నేస్తం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular