Monday, June 15, 2026
HomeTrending Newsమైనార్టీలకు మంచి చేసిన చరిత్ర మాది': లోకేష్

మైనార్టీలకు మంచి చేసిన చరిత్ర మాది’: లోకేష్

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే మైనార్టీ కార్పొరేషన్ ను పునరుద్ధరించి పేదవారిని ఆదుకుంటామని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. ముస్లిం మైనార్టీ వర్గాల అభ్యున్నతి కోసం తొలిసారిగా కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత అన్న ఎన్టీఆర్ కే దక్కుతుందని,  గత చంద్రబాబు హయంలో కూడా ఈ వర్గాలకు రుణాలు అందజేసి వారి అభివృద్ధికి తాము కృషి చేశామని… కానీ ఈ ప్రభుత్వం ఆ కార్పొరేషన్ ను నిర్వీర్యం చేసిందని లోకేష్ ఆరోపించారు. యువ గళం పాదయాత్రలో భాగంగా అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం కలికిరిలో మైనార్టీ సోదరులతో ముఖాముఖి నిర్వహించారు.

జగన్ ప్రభుత్వంలో మైనార్టీలకు తీవ్రమైన అన్యాయం జరుగుతోందని, రంజాన్ తోఫా కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాము వచ్చిన తరువాత రంజాన్ తోఫా, దుల్హన్, విదేశీ విద్య, ఫీజు రీఇంబర్స్ మెంట్ పథకాలను పూర్తిస్థాయిలో అమలు చేస్తామని, హజ్ యాత్రికులకు పూర్తి ఖర్చులు తమ హయంలో ఇచ్చామని గుర్తు చేశారు. మైనార్టీలకు మంచి చేసిన చరిత్ర తమదేనని, గతంలో తాము అందజేసిన పతకాలను మళ్ళీ మైనార్టీలకు అందేలా చూస్తామని భరోసా ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular