బీహార్‌లోని గయా జిల్లాలో మావోయిస్టులు ఈ రోజు మందుపాతర పేల్చగా సీఆర్పీఎఫ్ అధికారి సహా ఓ జవాన్ తీవ్రంగా గాయపడ్డారు. గయాలోని ఛక్రబంధా అటవీ ప్రాంతంలో సీఆర్పీఎఫ్‌కు సంబంధించిన కోబ్రా కమాండో దళం మావోయిస్టుల కోసం గాలింపు చేపట్టింది. ఈ క్రమంలో మావోయిస్టులు మందుపాతర పేల్చడంతో సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ విభోర్ కుమార్ సింగ్ తీవ్రంగా గాపడ్డారు. పేలుడు ధాటికి ఆయన రెండు కాళ్లు విరిగిపోయాయని పోలీసులు తెలిపారు. ఈ పేలుడులో మరో జవాన్‌కు గాయాలయ్యాయని చెప్పారు. వారిని సమీపంలోని దవాఖాను తరలించామని… కోబ్రా పెట్రోలింగ్ బృందంపై కూడా మావోయిస్టులు కాల్పులు జరిపారని చెప్పారు.
మరోవైపు గయ జిల్లాలోనే పెను ప్రమాదం తప్పింది. జిల్లాలోని సాగర్ పూర్ గ్రామంలో మావోలు అమర్చిన మందుపాతరను పోలీసులు సురక్షితంగా నిర్వీర్యం చేశారు. కూంబింగ్ కు వెళ్ళిన పోలీసులు బలగాలు ముందుగా గుర్తించటంతో పెను ప్రమాదం తప్పిందని పాట్నాలో పోలీసులు ఉన్నతాదికారులు తెలిపారు.