Friday, March 29, 2024
Homeసినిమాలావణ్య త్రిపాఠి హ్యాపీ బ‌ర్త్ డే ఎప్పుడు?

లావణ్య త్రిపాఠి హ్యాపీ బ‌ర్త్ డే ఎప్పుడు?

Birthday: ‘మత్తువదలరా’ చిత్రంతో ప్రేక్షకుల అభినందనలతో పాటు విమర్శకుల ప్రశంసలు పొందిన దర్శకుడు రితేష్ రానా దర్శకత్వంలో రాబోతున్న తాజా చిత్రం హ్యాపీ బర్త్‌డే. ప్రముఖ కథానాయిక లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి నిర్మిస్తుంది. నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి (చెర్రి), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నరేష్ ఆగస్త్య, సత్య, వెన్నెల కిషొర్, గుండు సుదర్శన్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని జూలై 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.

టీజర్‌తో ఆకట్టుకున్న ఈ చిత్రబృందం.. ఇటీవల చిత్రంలోని పాత్రలను పరిచయం  చేస్తూ  ప్రచార చిత్రాలను విడుదల చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇందులో భాగంగానే కథానాయిక లావణ్యత్రిపాఠి పాత్రను పరిచయం చేస్తూ ఓ ప్రోమోను విడుదల చేసింది చిత్రబృందం. ఈ చిత్రంలో హ్యాపీ 340గా లావణ్య కనిపించబోతుంది. ఆమె పాత్ర ఎవ్వరూ ఊహించని విధంగా, పూర్తి వినోదాత్మకంగా వుండబోతుందని చిత్ర బృందం తెలిపింది.

Also Read : హ్యాప్తీ బర్త్‌డే టీజర్‌ విడుదల 

RELATED ARTICLES

Most Popular

న్యూస్