Lift it: ప్రభుత్వం పవర్ హాలిడే ను వెంటనే ఎత్తివేయాలని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ డిమాండ్ చేశారు. పవర్ హాలిడే నిర్ణయం పరిశ్రమలు, ఉపాధి క‌ల్పనా రంగాల‌ను తీవ్ర సంక్షోభంలోకి నెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి లోకేష్ లేఖ రాశారు,

గత ఐదేళ్ళ చంద్రబాబు పాలనలో ఏనాడు కరెంట్ కోతలు లేవని,  కానీ ఈ ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని నిర్వీరం చేసి రాష్ట్రాన్ని అంధకారంలోకి  నెట్టిందని లోకేష్ ఆరోపించారు. ఎంతో ముందు చూపుతో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యుత్ సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటే జగన్ అధికారంలోకి రాగానే పీపీఏలను రద్దు చేసిందని గుర్తు చేశారు. తాము ఐదేళ్ళలో పైసా భారం కూడా ప్రజలపై మోపకపోయినా  నాటి ప్రతిపక్షం తమపై దుష్ప్రచారం చేసిందని విమర్శించారు.

ప‌రిశ్రమల్లో ఉత్పత్తి నిలిపివేయడం ద్వారా నెలవారీ అద్దెలు, చెల్లించాల్సిన వాయిదాలు, అప్పుల‌కు వడ్డీలు కట్టలేక యాజమాన్యాలు విల‌విల్లాడుతున్నాయని ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చారు. విద్యుత్‌ కోతలతో గ్రానైట్‌, ఆక్వా, పౌల్ట్రీ, వ‌స్త్ర‌, ఆహార‌ పరిశ్రమలు తీవ్రంగా నష్టపోయాయని,  ఇప్పటికైనా ఉన్నతాధికారులతో స‌మీక్షించి ప‌వ‌ర్ హాలీడేని ఎత్తేసే మార్గం ఆలోచించాలని లోకేష్ సూచించారు. వాణిజ్య, పరిశ్రమల వినియోగదారుల నెత్తిన పెను భారాన్ని మోపుతూ ఎనర్జీ డ్యూటీ ని 6 పైసల నుండి రూపాయికి పెంచి సుమారుగా రూ.3 వేల కోట్లు వసూలు చేసే నిర్ణయంపై కూడా పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు.

Also Read : ముందుచూపు లేకనే… : లోకేష్ విమర్శ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *