Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

Liger – Tyson:
సెన్సేష‌నల్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా న‌టిస్తోన్న యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్ `లైగర్`. ఈ చిత్రానికి సాలా క్రాస్ బ్రీడ్ అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రంతో లెజెండ్ మైక్ టైసన్ ఇండియన్ స్క్రీన్ మీద కనిపించబోతోన్నారు. ఈ చిత్రాన్ని డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్నారు. మైక్ టైసన్ ఈ ప్రాజెక్ట్‌ లోకి అడుగుపెట్టడంతోనే ఈ సినిమా పై అంచనాలు ఆకాశన్నంటాయి. ఇటీవ‌ల అమెరికాలో ప్రారంభ‌మైన ఈ మూవీ షెడ్యూల్ పూర్త‌య్యింది. ఈ షెడ్యూల్‌లో మైక్ టైస‌న్ పాత్ర‌కి సంభందించిన చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసింది చిత్ర యూనిట్.

‘మైక్ టైసన్ సంపూర్ణ సహాకారమందించారు, ఆయ‌న‌తో షూటింగ్ స‌జావుగా సాగింది` అంటూ షూటింగ్ లొకేష‌న్ నుండి కొన్ని ఫోటోల‌ను విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌. ఈ ఫోటోల‌లో టైస‌న్ భార్య కికి కూడా ఉన్నారు. మైక్ టైసన్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రాన్ని బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

థాయిలాండ్ స్టంట్ డైరెక్టర్ కెచ్చా యాక్షన్ సీక్వెన్స్‌లను కంపోజ్ చేస్తున్నారు. విష్ణు శర్మ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. రమ్యకృష్ణ, రోనిత్ రాయ్ ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ఈ మూవీ హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మళయాలి భాషల్లో రూపొందిస్తున్నారు. లైగర్ ప్రస్తుతం ముగింపు దశలో ఉంది. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఈ సినిమాను విడుదల చేసేందుకు మేకర్లు ప్లాన్ చేస్తున్నారు.

Also Read :  భారతీయ వంటకాలకు మైక్ టైసన్ ఫిదా

Leave a Reply

Your email address will not be published.

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com