Wednesday, March 11, 2026
HomeTrending NewsNDA: జులై 18న ఎన్డీయే మీటింగ్...టిడిపికి ఆహ్వానం

NDA: జులై 18న ఎన్డీయే మీటింగ్…టిడిపికి ఆహ్వానం

ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా ఏర్పాటు చేయని ఎన్ డి యే సమావేశం ప్రతిపక్షాల ఐక్కత దెబ్బకు దిగొచ్చింది. ఇప్పటికే ఎన్ డిఎ లో వున్న భాగస్వామ్య పక్షాలతో పాటు కొత్తగా కూటమి లోకి తీసుకునే వారికి సమావేశానికి ఆహ్వానం. టిడిపి,శిరోమణి అకాళీదళ్, లోక్ జనశక్తి (పాశ్వాన్) పార్టీలు సహా మరికొన్ని పార్టీలకు ఆహ్వానం అందినట్టు సమాచారం. ఈ నెల 18న ఢిల్లీలోని అశోకా హోటల్ లో సమావేశం నిర్వహిస్తున్నారు. లోక్ సభ ఎన్నికలు, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ద్రుష్టిలో పెట్టుకుని వ్యూహాత్మకంగా ముందుకు కదులుతున్న బిజెపి పెద్దలు…కేంద్ర ప్రభుత్వం, పార్టీలో మార్పులు, చేర్పులతో పాటు ఎన్డిఎ విస్తరణకు కసరత్తు పూర్తి చేసి కార్యాచరణకు పూనుకున్న్ననారు. ఇప్పటికే పలు రాష్ట్రాల పార్టీల అధ్యక్షుల మార్పులు..రెండు మూడు రోజుల్లో కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ దిశగా కదులుతున్నారు.

దేశ రాజధాని ఢిల్లీలో ఈ నెల 18న ఎన్డీఏ కూటమి కీలక సమావేశం నిర్వహిస్తుంది. ఈ సమావేశానికి పలు పార్టీలకు ఆహ్వానాలు పంపించినట్లు తెలుస్తొంది. అలానే ఏ కూటమికి చెందని మరి కొన్ని పార్టీలను ఎన్డీఏ సమావేశానికి ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. దక్షిణాది రాష్ట్రాల్లోని పలు పార్టీలతో పొత్తుల కోసం బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. ఏపికి చెందిన అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ ఇప్పటి వరకూ ఏ కూటమిలో లేకపోయినా కేంద్రంలోని బీజేపీకి అనధికార మిత్రపక్షంగానే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో తొలుత ఎన్డీఏ చేరాలంటూ వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ ను ఆహ్వానించగా, నేరుగా ఎన్డీఏలో చేరడానికి అంగీకరించలేదనీ, కాకపోతే బయట ఉండే సహకరిస్తామని చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ తరుణంలో కొద్ది రోజుల క్రితం ఓ జాతీయ న్యూస్ ఛానల్ తో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ మరల ఎన్డీఏ తో కలవడానికి అభ్యంతరం లేదంటూ చెప్పారు. ఆ తర్వాత ఢిల్లీలో అమిత్ షా, జేపీ నడ్డాలతో చంద్రబాబు సమావేశమైయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular