Saturday, July 27, 2024
Homeస్పోర్ట్స్The Ashes 3rd test: తొలి రోజు 13 వికెట్లు

The Ashes 3rd test: తొలి రోజు 13 వికెట్లు

యాషెస్ సిరీస్ లో తొలిరోజు 13 వికెట్లు పడ్డాయి. లీడ్స్ లోనే హెడింగ్లే మైదానంలో మొదలైన ఈ టెస్టులో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఆస్ట్రేలియా 4 పరుగులకే తొలి వికెట్ (వార్నర్-4) కోల్పోయింది. మిచెల్ మార్ష్ సెంచరీ (118- 118 బంతుల్లో 17 ఫోర్లు, 4 సిక్సర్లు) తో ఆదుకున్నాడు. మిగిలిన వారిలో ట్రావిస్ హెడ్-39; స్మిత్-22; లబుషేన్-21 రన్స్ చేశారు. 263 పరుగులకు కంగారూలు ఆలౌట్ అయ్యారు.

ఇంగ్లాండ్ బౌలర్లలో మార్క్ వుడ్-5; క్రిస్ ఓక్స్ 3; స్టువార్ట్ బ్రాడ్ 2 వికెట్లు పడగొట్టారు.

ఆ తర్వాత ఇంగ్లాండ్ 18 రన్స్ కు తొలి వికెట్ (బెన్ డకెట్-2) కోల్పోగా, ఆ వెంటనే హ్యారీ బ్రూక్ (2) కూడా వెనుదిరిగాడు. 33 పరుగులు చేసిన మరో ఓపెనర్ జాక్ క్రాలే 33 రన్స్ చేసి 65 పరుగుల వద్ద ఔటయ్యాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 68 పరుగులు చేసింది.

ఆసీస్ బౌలర్లలో కెప్టెన్ పాట్ కమ్మిన్స్ 2; మిచెల్ మార్ష్ ఒక వికెట్ సాధించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్