రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వ్యవసాయం చేసే రైతుకి సాయం అందడం లేదని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. 3 వేల కోట్ల తో ప్రత్యేక నిధి పెట్టి గిట్టు బాటు ధర కల్పిస్తామని హామీ ఇచ్చిన జగన్ రెడ్డి ఆచరణలో విఫలమయ్యారని ఆరోపించారు. యువ గళం పాదయాత్రలో భాగంగా రెండో రోజు కుప్పం నియోజకవర్గంలోని కడపల్లిలో పొలంలో పని చేసుకుంటున్న రైతు దంపతులు రాజమ్మ, ముని రత్నం ని లోకేష్ కలుసుకున్నారు.
మొక్క జొన్న, టొమాటో పంటలు వేసి నష్ట పోయామంటూ రైతులు తమ ఆవేదనను లోకేష్ ఎదుట వాపోయారు. ఏ పంటకు గిట్టుబాటు ధర లేదని, పెట్టుబడి పెరిగిపోతుంది కానీ పండిన పంటకు కనీస ధర రాక ఇబ్బంది పడుతున్నామని వారు లోకేష్ లు తమ వేదన చెప్పుకున్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో టమోటా రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారని, అసలు మన వ్యవసాయ శాఖ మంత్రి ఎవరో కూడా తెలియని పరిస్థితుల్లో రైతులు ఉన్నారన్నారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు పంటలకు గిట్టుబాటు ధర కల్పించామని గుర్తు చేశారు. చంద్రబాబు మళ్ళీ సిఎం కావడం ఖాయమని, మళ్ళీ రైతులకు పెట్టుబడి ధర అందిస్తామని హామీ ఇచ్చారు.
Also Read : కుప్పంలో మూడ్రోజులపాటు యువ గళం యాత్ర