Sunday, June 7, 2026
Homeసినిమాసెప్టెంబర్ 10న ‘లవ్ స్టోరీ’?

సెప్టెంబర్ 10న ‘లవ్ స్టోరీ’?

అక్కినేని నాగచైతన్య – ‘ఫిదా’ బ్యూటీ సాయిపల్లవి జంటగా నటించిన తాజా చిత్రం లవ్ స్టోరీ. ఈ చిత్రానికి సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలోని ‘సారంగదరియా’ సాంగ్ యూట్యూబ్ ని షేక్ చేయడం.. సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం తెలిసిందే. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీగా ఉంది. దీంతో ఈ సినిమాకి పలు ఓటీటీ సంస్థ నుంచి 10 భారీ ఆఫర్స్ వచ్చాయి అయినప్పటికీ.. లవ్ స్టోరీ మూవీని థియేటర్లోనే రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు.

ఇటీవలే తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు ఓపెన్ అయ్యాయి. దీంతో ‘లవ్ స్టోరీ’ రిలీజ్ కు దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.  తాజా సమాచారం ప్రకారం సెప్టెంబర్ 10న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారట. త్వరలో డేట్ ను అఫిషియల్ గా అనౌన్స్ చేయనున్నారు. ఇక నాగచైతన్య నటించిన మరో సినిమా ‘థ్యాంక్యూ’. మనం ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న థ్యాంక్యూ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular