Tuesday, April 16, 2024
HomeTrending Newsతెలుగు రాష్ట్రాల నీటి వివాదం

తెలుగు రాష్ట్రాల నీటి వివాదం

తెలంగాణకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దాఖలు చేసిన పిటిషన్‌ను నేడు విచారించిన సుప్రీంకోర్టు. ఈ కేసులో చట్టపరమైన సమస్యలపై ఆంధ్ర-తెలంగాణ జల వివాదానికి తాను తీర్పు చెప్పలేనని ఇరు రాష్ట్రాల న్యాయవాదులకు స్పష్టం చేసిన ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ.  ఇరు రాష్ట్రాలు మధ్యవర్తిత్వానికి అంగీకరిస్తే ప్రధాన న్యాయమూర్తి  నేతృత్వంలోని బెంచ్ సహాయపడుతుంది. రాష్ట్రాలు తమ నిర్ణయం తెలియజేయడానికి ఈ కేసు 4 వ తేదీకి (బుధవారం) వాయిదా. మధ్యవర్తిత్వం కాకుండా తమ వాదనలు వినిపించడంతో పాటు, చట్టప్రకారం ముందుకు వెళ్లాలని నిర్ణయించుకుంటే వేరే ధర్మాసనం ముందు వాదనలు వినిపించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూచన.

 ఏపి ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే, తెలంగాణ తరపున సిఎస్ వైద్యనాధన్ వాదనలు. తాగునీరు, సాగునీరు  ప్రయోజనాల కోసం తమకు న్యాయబద్ధమైన వాటాను తెలంగాణ రాష్ట్రం  నిరాకరిస్తున్నదని పిటీషన్ లో ఆరోపించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. శ్రీశైలం డ్యామ్ నుంచి తెలంగాణ రాష్ట్రం విద్యుదుత్పత్తి చేయడం ద్వారా నీటి వినియోగం కారణంగా రిజర్వాయర్ పరిమాణం తీవ్రంగా క్షీణించింది. దీనిని నిలిపివేయాలని తెలంగాణను అభ్యర్థించిన ఏపీ ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వ తీరును తప్పుపడుతూ పిటిషన్‌ వేసిన ఏపీ. కృష్ణా నదీజలాలు, నీటి ప్రాజెక్టుల పట్ల తెలంగాణ అనుసరిస్తున్న వైఖరి పట్ల అభ్యంతరం వ్యక్తం చేసిన ఏపీ. ఏపీ ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తోందని ఏపీ ప్రభుత్వం తన పిటిషన్‌లో పేర్కొంది.

శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల రిజర్వాయర్ల పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా నియంత్రణ ఉండాలని కూడా పిటిషన్ లో కోరింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్