Sunday, September 8, 2024
Homeస్పోర్ట్స్IPL: పంజాబ్ పై లక్నో పంజా

IPL: పంజాబ్ పై లక్నో పంజా

మొహాలీ స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్- పంజాబ్ కింగ్స్ మధ్య నేడు జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో పరుగుల వరద పారింది. రెండు జట్లూ కలిపి 458 పరుగులు చేశాయి. సిక్సర్లు, ఫోర్లతో స్టేడియం హోరెత్తింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 5 వికెట్లు కోల్పోయి 257 పరుగులు చేయగా, పంజాబ్ 201 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

లక్నో చేసిన 257 పరుగులు… ఈ సీజన్ కు హయ్యస్ట్ స్కోరు కాగా, ఐపీఎల్ చరిత్రలో రెండోది. 2013లో ఆర్సీబీ 263 పరుగులు చేసింది, ఇదే హయ్యస్ట్.

టాస్ గెలిచిన పంజాబ్ బౌలింగ్ ఎంచుకుంది, లక్నో కెప్టెన్ కెఎల్ రాహుల్ (12) ఈ మ్యాచ్ లో విఫలమయ్యాడు.

  • మార్కస్ స్టోనిస్ 40 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 72
  • కేల్ మేయర్స్  24 బంతుల్లో 7 ఫోర్లు,  4 సిక్సర్లతో 54
  • నికోలస్ పూరన్ 19 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సర్ తో 45
  • అయూష్ బదోనీ 24 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 43 పరుగులతో సూపర్ ఇన్నింగ్స్ ఆడారు.

దీపక్ హుడా-11; కృనాల్ పాండ్యా-5 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. పంజాబ్ బౌలర్లలో రబడ ­2; అర్ష్ దీప్ సింగ్, శామ కర్రన్, లివింగ్ స్టోన్ తలా ఒక వికెట్ సాధించారు.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ 31 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. మళ్ళీ జట్టుతో చేరిన కెప్టెన్ శిఖర్ ధావన్ (1);  సిమ్రాన్ సింగ్ (9) విఫలమయ్యారు. అథర్వ తైడే- సికిందర్ రాజా మూడో వికెట్ కు 78 పరుగులు జోడించారు. తైడే 36 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 66 ; సికిందర్ 22 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్ తో 36; లివింగ్ స్టోన్ 23;  శామ్ కర్రన్ 21;  జితేష్ శర్మ 24 పరుగులతో రాణించారు, 19.5 ఓవర్లలో 201 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

లక్నో బౌలర్లలో యష్ ఠాకూర్ 4; నవీన్ ఉల్ హక్ 3; రవి బిష్ణోయ్ 2; స్టోనిస్ ఒక వికెట్ పడగొట్టారు.

స్టోనిస్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది

RELATED ARTICLES

Most Popular

న్యూస్