Saturday, July 27, 2024
HomeTrending NewsCM Jagan: మే 9న 'జగనన్నకు చెబుదాం'కు శ్రీకారం

CM Jagan: మే 9న ‘జగనన్నకు చెబుదాం’కు శ్రీకారం

ముఖ్యమంత్రి నేరుగా ప్రజలతో మమేకమయ్యే ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమానికి మే నెల 9న  శ్రీకారం చుడుతున్నట్లు సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా ముఖ్యమంత్రికి తెలియజేయవచ్చని, సిఎం తో పాటు సిఎంవో ఈ సమస్యలను నిర్దేశిత సమయంలోగా పరిష్కారం అయ్యేలా చూస్తుందని వెల్లడించారు. జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో స్పందన కార్యక్రమంపై క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జగనన్నకు చెబుదాం కార్యక్రమంపై ప్రతేకంగా వారికి దిశా నిర్దేశం చేశారు. ఇది మరో ప్రతిష్టాత్మక కార్యక్రమమని, దీనికోసం 1902 అనే హెల్ప్‌ లైన్‌ నంబర్‌ను పెడుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంపై ఇప్పటికే పలుమార్లు సమీక్షలు చేశామన్నారు.

మనం ఇప్పటికే స్పందన నిర్వహిస్తున్నామని, దీనికి మెరుగైన మెరుగైన రూపమే ‘జగనన్నకు చెబుదాం’ అని పేర్కొన్నారు. ప్రజలకు నాణ్యమైన సేవలను అందించడం, వ్యక్తిగత సమస్యలను అత్యంత నాణ్యంగా పరిష్కరించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని స్పష్టం చేశారు. ప్రభుత్వ సేవలు, పథకాలపై ఎంక్వైరీ, ముఖ్యమంత్రి సందేశాలను నేరుగా చేరవేయడం కూడా దీనిలో ప్రధాన భాగాలని చెప్పారు.

జగనన్నకు చెబుదాం పై సిఎం సూచనలు:

  • ఐవీఆర్‌ఎస్, ఎస్‌ఎంఎస్‌ ల ద్వారా తాము చెప్పిన సమస్యల పరిష్కారంపై ప్రజలకు క్రమం తప్పకుండా అప్‌డేట్స్‌ అందుతాయి. అర్జీదారులనుంచి ఫీడ్‌ బ్యాక్‌ కూడా తీసుకుంటుంది.
  • గ్రామ, వార్డు సచివాలయాల్లో వాలంటీర్లు ప్రతి ఇంటినీ సందర్శించి 1902 హెల్ప్‌ లైన్‌ గురించి అవగాహన కల్పిస్తారు.
  • ఈ హెల్ప్‌లైన్‌ను వినియోగించుకునేలా వారిని మరింతగా ప్రోత్సహిస్తారు.
  • సీఎం కార్యాలయం నుంచి మండల కార్యాలయాల వరకూ ప్రాజెక్ట్‌ మానిటరింగ్‌ యూనిట్లు ఉంటాయి.
  •  సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు జిల్లాలకు ప్రత్యేకాధికారులుగా ఉంటారు.
  • క్రమం తప్పకుండా ఆయా జిల్లాలను వీరు సందర్శించి పర్యవేక్షిస్తారు.
  • ప్రతి 15 రోజులకోసారి సంబంధిత జిల్లాలను çసందర్శించి పర్యవేక్షిస్తారు.
  • కలెక్టర్లతో కలిపి జగనన్నకు చెబుదాం కార్యక్రమం అమలును పర్యవేక్షిస్తారు.
  • సమస్యల పరిష్కారాల తీరును రాండమ్‌గా చెక్‌చేస్తారు.
  • ప్రాజెక్ట్‌ మానిటరింగ్‌ యూనిట్ల పనితీరును పర్యవేక్షిస్తారు.
  • ఎక్కడైనా సమస్య పరిష్కారం పట్ల సంతృప్తి లేకపోతే.. దాన్ని తిరిగి ఓపెన్‌ చేస్తారు.
  • ఎస్‌ఎంఎస్, ఐవీఆర్‌ఎస్‌ ద్వారా వచ్చిన ఫీడ్‌ బ్యాక్‌ ఆధారంగా దాన్ని తిరిగి తెరుస్తారు.
  • పరిష్కార తీరుపై పూర్తిస్థాయిలో సమీక్ష చేస్తారు:
  • చీఫ్‌ సెక్రటరీ, సీఎంఓ, డీజీపీతో కలిసి రెగ్యులర్‌గా మానిటర్‌ చేస్తారు.
  •  ప్రతి 15 రోజులకోసారి పూర్తిస్థాయిలో సమీక్ష ఉంటుంది.
RELATED ARTICLES

Most Popular

న్యూస్