Sunday, January 19, 2025
Homeసినిమాజూన్ 24న ఎంఎస్ రాజు 7 డేస్ 6 నైట్స్ విడుద‌ల‌

జూన్ 24న ఎంఎస్ రాజు 7 డేస్ 6 నైట్స్ విడుద‌ల‌

నిర్మాతగా సూపర్ డూపర్ బ్లాక్‌బస్టర్స్ ప్రేక్షకులకు అందించిన ఎం.ఎస్. రాజు దర్శకునిగా ‘డర్టీ హరి’తో గతేడాది హిట్ అందుకున్నారు. తాజాగా, మెగా బ్యానర్ సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో వైల్డ్ హనీ ప్రొడక్షన్ పతాకం పై ఎంఎస్ దర్శకత్వం వహించిన మరో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘7 డేస్ 6 నైట్స్‘ జూన్ 24న విడుదల కి సిద్ధంగా ఉంది. సుమంత్ అశ్విన్ హీరోగా, మెహర్ చాహల్ (తొలి పరిచయం) హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో మరో జంటగా రోహన్, క్రితికా శెట్టిని పరిచయం చేస్తున్నారు. మరో ఇద్దరు అందమైన అమ్మాయిలు సుష్మ, రిషికా బాలి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ ఫేమ్ గోపరాజు రమణ అతిథి పాత్రలో కనిపించనున్నారు.

దర్శకుడు ఎంఎస్ రాజు మాట్లాడుతూ… “ఫైనల్ కాపీ మా చేతిలోకి వచ్చినా, కరోనా మూడవ వేవ్ ముందస్తు చర్యలు, పెద్ద సినిమాల విడుదల నేపథ్యంలో…. కచ్చితంగా థియేటర్లలోనే విడుదల చేయాలన్న సంకల్పంతోనే  మా ‘7 డేస్ 6 నైట్స్’ ని ప్రేక్షకుల ముందుకి తీసుకురావడానికి ఇంత సమయం తీసుకున్నాం. ఆకట్టుకునే కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, విజువల్స్, మ్యూజిక్ తో ఈ చిత్రం కేవలం యూత్ కి మాత్రమే కాక అన్ని వర్గాల ప్రేక్షకులని అలరిస్తుంది”

“కొత్త కథలతో రావాలన్న నా కోరిక మేరకు డర్టీ హరి లాంటి చిత్రం తరువాత ఒక లైట్ హార్టెడ్ ఎంటర్టైనర్ గా, అంచనాలకి ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తున్నాం. హీరో సుమంత్ అశ్విన్ ఇందులో పూర్తి భిన్నంగా పాత్రలో చాలా ఒదిగిపోయి నటించారు. హీరోయిన్ మెహర్ చాహల్ మరో జంట రోహన్, క్రితికా శెట్టి తొలి పరిచయం అయినా అద్భుతంగా నటించారు పాత్రలకి పూర్తి న్యాయం చేసారు. ఈ నెల జూన్ 24న థియేటర్లలో విడుదల కానున్న మా చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను” అని అన్నారు.

Also Read : ‘7 డేస్ 6 నైట్స్’ థియేట్రికల్‌ ట్రైల‌ర్‌కు మంచి స్పందన

RELATED ARTICLES

Most Popular

న్యూస్