Friday, March 29, 2024
Homeసినిమామే 6న  ‘మా ఇష్టం’ విడుద‌ల‌

మే 6న  ‘మా ఇష్టం’ విడుద‌ల‌

Maa Ishtam:  వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వర్మ తెర‌కెక్కించిన తాజా చిత్రం మా ఇష్టం. జానర్ ఏదైనప్పటికీ తాను ఏదైతే చెప్పాలని అనుకుంటున్నారో దానికి తెర రూపమిస్తుంటారు. విలక్షణ దర్శకుడిగా వెండితెర పై తన మార్క్ చూపిస్తున్న వ‌ర్మ‌ దేశంలోనే తొలిసారి ‘మా ఇష్టం’ సినిమా రూపంలో ఓ లెస్బియన్ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇద్దరమ్మాయిల ప్రేమకథతో తెరకెక్కిన్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, వీడియోస్ సినిమా పై అంచనాలు పెంచేశాయి.

ఈ మా ఇష్టం (డేంజరస్) చిత్రాన్ని మే 6వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు రామ్ గోపాల్ వర్మ. ఈ మేరకు మూవీ ప్రమోషన్స్ చేపట్టిన ఆర్జీవీ.. ఆస్క్ ఎనీథింగ్ అనే కార్యక్రమం చేపట్టారు. హైదరాబాద్ అంబేద్కర్ యూనివర్సిటీలో జరిగిన ఈ కార్యక్రమంలో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మతో పాటు చిత్రంలో లీడ్ రోల్స్ పోషించిన నైనా గంగూలీ, అప్సర రాణి పాలొన్నారు. లెస్బియన్ శృంగారం విషయమై పలువురు స్టూడెంట్స్, రాముయిజం ఫాలోవర్స్ అడిగిన ఘాటైన ప్రశ్నలకు వర్మ ఓపెన్ గా సమాధానాలు చెప్పి మెప్పించారు. ఈ సినిమా ఓ డిఫరెంట్ అనుభూతి కలిగిస్తుందని, గతంలో ఎన్నడూ చూడని విధంగా ఉంటుందని ఆర్జీవీ చెప్పారు.

ఇది మహిళల మధ్య సాగే ఘాటు ప్రేమ కథ. స్త్రీ, పురుషుని మధ్య ప్రేమ, లైంగిక వాంఛ ఎలా అయితే ఉంటాయో వీరి మధ్య కూడా అలాగే ఉంటాయి. ఎందుకంటే.. ప్రేమ అనేది ప్రేమ మాత్రమే. దానికి లింగబేధంతో ఎలాంటి సంబంధం లేదు అని పేర్కొంటూ రిలీజ్ చేసిన‌ ‘మా ఇష్టం’ ట్రైలర్ సినిమా పై క్యూరియాసిటీ పెంచేసింది. క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ గా తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా మే 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్