Sunday, June 14, 2026
Homeసినిమా'మా నీళ్ల ట్యాంక్' వెబ్ సిరీస్ టీజ‌ర్ విడుదల

‘మా నీళ్ల ట్యాంక్’ వెబ్ సిరీస్ టీజ‌ర్ విడుదల

Water Tank:  లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో టాలీవుడ్ హీరో సుశాంత్ “మా నీళ్ల ట్యాంక్‘ వెబ్ సిరీస్ లో నటించడం విశేషం. ఈ శిరీస్ -ఒక చిన్న గ్రామం ఆధారంగా రూపొందించబడిన రొమాంటిక్ కామెడీతో హార్ట్‌త్రోబ్ “మా నీళ్ల ట్యాంక్’. ఈ వెబ్ సిరీస్ ఎంతో రిఫ్రెసింగ్  గా ఉంటుంది. ఇందులో నటి ప్రియా ఆనంద్ 10 సంవత్సరాల విరామం తర్వాత తెలుగు తెరపై నటించింది.

దర్శకురాలు లక్ష్మీ సౌజన్య మాట్లాడుతూ… “మా నీళ్ల ట్యాంక్’  8-ఎపిసోడ్‌లు కలిగిన వెబ్ సిరీస్. ఒక ఫీల్ గుడ్ పల్లెటూరి కథ.. బుచ్చివోలు అనే గ్రామం నేపథ్యంలో సాగే ఈ సిరీస్ ఇంట్ర‌స్టింగ్ గా సాగుతుంది. ఎమ్మెల్యే కోదండం కుమారుడు గోపాల్ తను ప్రేమించిన సురేఖ తిరిగి రాకపోతే పనికిరాని వాటర్ ట్యాంక్‌లో దూకుతానని బెదిరిస్తాడు. అప్పుడే ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఎందుకు తన కొడుకు ఇలా చేస్తున్నాడని కోదండం కంగుతింటాడు. అతని బంధువు నరసింహం, అదే సమయంలో, అతని ప్రతిష్టను దెబ్బతీయడానికి మరియు అధికారాన్ని చేజిక్కించు కోవడానికి ప్రయత్నిస్తుంటాడు.

అలాగే అదే ఊరిలో గిరి అనే సబ్‌ఇన్‌స్పెక్టర్‌కు ఊరి నుంచి బదిలీ కావాల్సి వస్తే సురేఖను తిరిగి తీసుకొచ్చే పనిని అప్పగిస్తారు. ఇద్దరు రాజకీయ ప్రత్యర్థుల మధ్య పిల్లి మరియు ఎలుకల ఆట మాదిరి  జరుగుతుంటే ,మరో వైపు గురుమూర్తి వాటర్ ట్యాంక్‌ మరమ్మతుల నుండి డబ్బును పొందాలని కోరుకుంటాడు. పనికిరాని ట్యాంక్ మరియు అమాయక సురేఖ చిన్న లక్ష్యాలతో స్వార్థపరుల చేతుల్లో ఎలా  సాధనాలుగా మారారని రొమాంటిక్ కామెడీతో చక్కగా తెరకేక్కించాం.మంచి  కథను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ZEE5 కు నా ధన్యవాదాలు అన్నారు.

Also Read : ZEE5 కొత్త వెబ్ సిరీస్‌ ‘రెక్కీ’ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular