Thursday, March 28, 2024
Homeసినిమా‘మహాసముద్రం’ మోషన్‌ పోస్టర్‌ రిలీజ్

‘మహాసముద్రం’ మోషన్‌ పోస్టర్‌ రిలీజ్

ఈ ఏడాది ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రాల్లో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘మహాసముద్రం’ కూడా ఒకటి… శర్వానంద్, సిద్దార్థ్‌ హీరోలుగా నటించిన ఈ మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైన‌ర్‌ మూవీని టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అజయ్‌ భూపతి, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రతిష్టాత్మకమైన నిర్మాణసంస్థ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ కలిసి ప్రేక్షకుల ముందుకు తెస్తున్నాయి. ఈ చిత్రంలో అనూ ఇమ్మాన్యుయేల్, అదితీరావ్‌ హైదరీ హీరోయిన్లుగా నటించారు.‘మహాసముద్రం’ క్యారెక్టర్‌ లుక్స్‌ పోస్టర్స్‌ను బట్టి సినిమాలోని ప్రతి పాత్రకు ప్రాముఖ్యం ఉన్నట్లు తెలుస్తుంది.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన శర్వానంద్, సిద్దార్థ్, అదితిరావ్‌ హైదరీ, అనూ ఇమ్మాన్యుయేల్, జగపతిబాబు, రావు రమేష్, గరుడ రామచంద్ర ఫస్ట్ లుక్ పోస్టర్ కు ప్రేక్షకుల నుంచి మంచి పాజిటివ్‌ రెస్పాన్స్‌ వస్తోంది. ‘మహాసముద్రం’ షూటింగ్‌ ఇటీవలే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌ శరవేగంగా జరుగుతున్నాయి. వెండితెరపై విడుదల అయ్యేందుకు ఈ చిత్రం రెడీ అవుతుంది. ఈ సందర్భంగా రానున్న కొద్ది రోజుల్లో ఈ సినిమా నుంచి ప్రేక్షకులకు ఆసక్తికరమైన అప్‌డేట్స్‌ ఇచ్చేందుకు చిత్రయూనిట్‌ రెడీ అవుతుంది. తాజాగా ఈ సినిమాలోని క్యారెక్టర్స్‌ మోషన్‌ పోస్టర్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది.

మోషన్‌ పోస్టర్‌లో కనిపిస్తున్న‘మహాసముద్రం’లోని ఇంటెన్స్‌ క్యారెక్టర్స్‌ సినిమాపై అంచనాలను రెట్టింపు చేస్తున్నాయి. ఇక ఫెరోసియస్‌గా కనిపిస్తున్న హీరోలు శర్వానంద్, సిద్దార్థ్ ల లుక్స్, తాజా కొత్త పోస్టర్స్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి,. సిద్దార్థ్‌ గన్‌ పట్టు కోవడం, శర్వానంద్ కోపోద్రిక్తుడై నడుచుకుంటూ రావడం మోషన్‌ పోస్టర్‌లో కనిపిస్తుంది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సుంకర రామబ్రహ్మాం ఈ లవ్‌ అండ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ మూవీని నిర్మిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్