మహేష్‌ బాబు, రాజమౌళి కాంబినేషన్లో భారీ చిత్రం రానుందని గత కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి కానీ.. ఇప్పటి వరకు అఫిషియల్ గా అనౌన్స్ చేయలేదు. అయితే.. ఆర్ఆర్ఆర్ తర్వాత మహేష్‌ బాబుతో సినిమా చేస్తానని రాజమౌళి ప్రకటించారు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై డా.కె.ఎల్. నారాయణ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. విజయేంద్రప్రసాద్ కథా చర్చల్లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ చాలా ఫాస్ట్ గా జరుగుతుంది.

అయితే.. ఆర్ఆర్ఆర్ మూవీకి ఆస్కార్ తెచ్చే పనుల్లో రాజమౌళి బిజీగా ఉన్నారు. కొన్ని నెలలు అమెరికాలోనే ఉండి ఆర్ఆర్ఆర్ మూవీని బాగా ప్రచారం చేశారు. ఆయన శ్రమకు తగ్గ ఫలితం దక్కేలా అడుగులు పడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ ఆస్కార్ అవార్డ్ కు ఒక్క అడుగు దూరంలో ఉంది. మార్చి 13న ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. ఆతర్వాత రాజమౌళి ఫ్రీ అవుతారు. మార్చి 13 తర్వాత కొద్ది రోజులు విశ్రాంతి తీసుకుని మహేష్ సినిమా పనుల్లో బిజీ కానున్నారని సమాచారం. అంటే.. ఏప్రిల్ నుంచి ఆ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అవుతుంది.

ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, హాలీవుడ్ ఆర్టిస్టులు… ఇలా అన్ని విషయాల పై ఏప్రిల్ లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిసింది. ఈసారి గతంలా కాకుండా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని…. ఎన్ని అడ్డంకులు ఎదురైనా వేసుకున్న ప్రణాళిక తప్పక అమలు పరచాయలని జక్కన్న స్ర్టాంగ్ గా ఉన్నట్లు సమాచారం.  మరి.. ఈ పాన్ వరల్డ్ మూవీతో జక్కన్న మరోసారి చరిత్ర సృష్టిస్తారేమో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *