Friday, June 12, 2026
Homeసినిమా'ఖుషి' గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సమంత

‘ఖుషి’ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సమంత

విజయ్ దేవరకొండ, సమంత కాంబినేషన్లో రూపొందుతోన్న విభిన్న ప్రేమకథా చిత్రం ‘ఖుషి’. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ సినిమాను 2022 డిసెంబర్ లో రిలీజ్ చేయాలి అనుకున్నారు. అనుకోవడమే కాదు.. అఫిషియల్ గా అనౌన్స్ చేయడం కూడా జరిగింది. అయితే.. సమంతకు అనారోగ్యం కారణంగా షూటింగ్ అనుకున్న విధంగా జరగలేదు. దీంతో ఖుషి మూవీ రిలీజ్ వాయిదా పడింది.

అయితే.. సమంత అనారోగ్యం నుంచి బయటపడింది కానీ.. ఖుషి షూటింగ్ స్టార్ట్ కాలేదు. మరో వైపు విజయ్ దేవరకొండ.. పరశురామ్ తో సినిమా చేయనున్నట్టు ప్రకటించాడు. అలాగే గౌతమ్ తిన్ననూరితో మరో మూవీ అనౌన్స్ చేశారు. మరో వైపు సమంత అనారోగ్యం నుంచి కోలుకున్న తర్వాత హిందీలో తెరకెక్కుతున్న వెబ్ సిరీస్ లో నటించేందుకు ముంబాయి వెళ్లింది. దీంతో ఖుషి కంప్లీట్ గా ఆగిపోయిందనే ప్రచారం మొదలైంది. ఈ ప్రచారం ఊపందుకోవడంతో డైరెక్టర్ శివ నిర్వాణ సోషల్ మీడియా ద్వారా త్వరలోనే ఖుషి షూటింగ్ స్టార్ట్ కానుందని అనౌన్స్ చేశారు.

ఇప్పుడు సమంత ఖుషి షూటింగ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఖుషి సినిమాకు సమంత డేట్స్ కేటాయించింది. మార్చి 1 నుంచి ఈ సినిమా మళ్లీ మొదలుకాబోతోంది. తాజా షెడ్యూల్ హైదరాబాద్ లోనే ఉంటుంది. ఈ మేరకు ఏర్పాట్లు మొదలయ్యాయి. సమంత నటించిన శాకుంతలం సినిమా ఏప్రిల్ 14న రిలీజ్ కానుంది. ఖుషికి సంబంధించి ఓ షెడ్యూల్ పూర్తయిన వెంటనే, శాకుంతలం ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తుంది సమంత. విజయ్ దేవరకొండతో శివ నిర్వాణకు ఇదే తొలి సినిమా. మరి.. ఈ మూవీతో విజయ్ కు కావాల్సిన విజయాన్ని శివ నిర్వాణ అందిస్తాడేమో చూడాలి.

Also Read : విజయ్ ఫ్యాన్స్ కి సారీ చెప్పిన సమంత

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular