Monday, March 16, 2026
Homeసినిమామిషన్ ఇంపాజిబుల్ ట్రైలర్ రిలీజ్ చేసిన మహేష్ బాబు

మిషన్ ఇంపాజిబుల్ ట్రైలర్ రిలీజ్ చేసిన మహేష్ బాబు

Mission coming: టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మ్యాట్నీఎంటర్‌టైన్‌మెంట్ మరో కంటెంట్-రిచ్ ఫిల్మ్ `మిషన్ ఇంపాజిబుల్‌`తో వస్తోంది. ఇందులో తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటిస్తుండగా, `ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ` ఫేమ్ దర్శకుడు స్వరూప్ RSJ ఈ మూవీని ఆక‌ట్టుకునేలా రూపొందిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను  లాంచ్ చేసి టీమ్‌కి శుభాకాంక్షలు తెలిపారు. ట్రైలర్ నిజానికి సినిమా ప్లాట్‌ లైన్‌లోని విష‌యాన్ని తెలియ‌జేస్తుంది. అవినీతిపరుడైన రాజకీయ నాయకుడు అరెస్టు, ఆ త‌ర్వాత‌ బెయిల్ అనే అంశాన్ని చెబుతూ ఇన్వెస్టిగేటివ్ పాత్రికేయురాలుగా తాప్సీ డైలాగ్‌తో ప్రారంభమవుతుంది.

తాప్సీ బృందం ఈ మిషన్‌ను నిర్వహించడం దాదాపు అసాధ్యమని భావించినప్పుడు, వారు తక్కువ సమయంలో ధనవంతుడిగా మారిన భార‌త‌దేశపు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీంను పట్టుకోవడానికి ముగ్గురు పిల్లల సహాయం తీసుకుంటారు. అసాధ్యమైనది ఏమీ లేదని భావించే తాప్సీ పిల్ల‌ల ధైర్యాన్ని చూసి ఆశ్చ‌ర్య‌పోతుంది. వారు ఈ మిషన్‌ను ఎలా పూర్తి చేస్తారు అనేది కథలో కీలకాంశంగా మారుతుంది.

దీపక్ యెరగరా సినిమాటోగ్రఫీ ఆకట్టుకోగా, మార్క్ కె రాబిన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరో పెద్ద అసెట్. సహజంగానే, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణ విలువలు సినిమా యొక్క జానర్‌ ఉన్నత స్థాయిలో ఉన్నాయి. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ఎన్ ఎం పాషా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రవితేజ గిరిజాల ఎడిటర్. వేసవిలో అపరిమిత వినోదాన్ని అందించడానికి మిష‌న్ ఇంపాజిబుల్ ఏప్రిల్ 1న థియేటర్లలో విడుదల అవుతుంది.

Also Read : ఏప్రిల్ 1న తాప్సీ ‘మిషన్ ఇంపాజిబుల్’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular